Home » ఆట 4 విన్నర్ “గీతిక” మీకు గుర్తుందా.. మరి ఇలా మారిపోయిందేంటి..?

ఆట 4 విన్నర్ “గీతిక” మీకు గుర్తుందా.. మరి ఇలా మారిపోయిందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక డాన్స్ షో ల ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్స్ వారి టాలెంట్ ను బయట పెట్టుకున్నారు. ఒకప్పుడు బుల్లితెరపై ఆట డాన్స్ షో చాలా ఫేమస్ అయ్యింది. ఆ సమయంలో చాలామంది డాన్సర్స్ వారి టాలెంట్ ను బయట పెట్టుకున్నారు. అందులో ఒకరు ఆట 4విన్నర్ గీతిక. గీతిక నాలుగేళ్ల వయసులోనే అందులో టైటిల్ విన్నర్ గెలవడంతో ఆమెపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు. షో తర్వాత గీతిక ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన లేదు.

Advertisement

చిన్నవయసులోనే అందరినీ అలరించిన గీతిక ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉందో చూస్తే అందరూ ఆశ్చర్య పోవడం ఖాయం. గీతిక ఈ టైటిల్ విన్నర్ తర్వాత బుల్లితెర కార్యక్రమాలన్నింటినీ దూరం పెట్టి తన చదువు పై దృష్టిసారించింది. తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ కి వెళ్లడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలి అని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆ విరామమే చాలా ఎక్కువ అయిందని గీతిక ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం ఆమె బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిపారు.

Advertisement

చిన్నతనంలో ఉన్నప్పుడు డ్యాన్స్ మీద మక్కువతో ఆట 4 టైటిల్ విన్నర్ అయ్యానని, దీని తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఆ వైపు వెళ్లాను అని వెల్లడించారు. ఇక ఈ టీవీ లో వస్తున్న ఢీ షో గురించి ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటానని అందులో కంటెస్టెంట్ నైనిక ఫర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చుతుందని తెలియజేశారు. తనకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే మహేష్ బాబు అని ఆమె తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading