Home » ఇళ్ల‌లో.. దుకాణాల‌లో తాబేలు ప్ర‌తిమ ను ఎందుకు ఉంచుతారో తెలుసా?

ఇళ్ల‌లో.. దుకాణాల‌లో తాబేలు ప్ర‌తిమ ను ఎందుకు ఉంచుతారో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

కొంత మంది త‌మ ఇళ్ల లో.. దుకాణా ల‌లో లోహం తో తయారు చేసిన ప్ర‌తిమ ల ను ఉంచ‌టం చాలా సార్లు చూసే ఉంటాం. అయితే అలా వారు త‌మ ఇళ్ల లో దుకాణాల లో తాబేలు ప్ర‌తిమ ను ఎందుకు పెడుతున్నారు అనే డౌట్ చాలా మందికే వ‌చ్చి ఉంటుంది. సాదారణం గా తాబేలు ఇళ్ల లో కి వ‌స్తే మంచిది కాద‌ని.. ఇళ్లు ప‌నికి రాదని అంటుంటారు. కానీ కొంత మంది అయితే లోహ‌పు తాబేలు ను స్వ‌యం గా ఇళ్ల లో కే తెచ్చుకుంటారు. అంతే కాకుండా వాణిజ్య స‌ముదాయాల లో కూడా లోహ‌పు తాబేలు ను ఉంచుతారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం..

Also Re ad:టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు ఇవే ..! టాప్ 5 లో ఉన్నవి ఇవే ..!

Advertisement

Advertisement

తాబేలు అనేది వాస్తు ప‌రం గా అనువైన జీవి అని న‌మ్ముతారు. వాస్తు ప్ర‌కారం తాబేలు ఇళ్ల లో కి వ‌స్తే దోషాల‌న్నీ కూడా తొలిగి పోతాయ‌ని ప‌లువురు వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. అలాగే ఫెంగ్ షూయ్ చైనా వాస్తు ప్ర‌కారం తాబేలు పై అనేక క‌థ లు ఉన్నాయి. ఈ ఫెంగ్ షుయ్ అనే వాస్తు ప‌ద్ద‌తి లో తాబేలు త‌న ఐదు అవ‌య‌వాల‌ను అంటే నాలుగు కాళ్లు, త‌ల.. త‌న లోనికి తీసుకుంటుందో.. అలాగే ఇళ్ల లో, దుకాణా ల‌లో కూడా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను అలా.. లోనికి తీసుకుంటుందని అర్థం.

అలాగే తాబేలు అంటే కొంత మంది శుభ సూచికం గా న‌మ్ముతారు. అందు కే తాబేలు ను ఇళ్ల లో ఉంచుతారు. అయితే తాబేలు ను ఎక్కడ ప‌డితే అక్క‌డ కాకుండా.. ఉత్త‌ర దిశ లో నే ఉంచాలి. దీని వ‌ల్ల ఆ కుటుంబం లో అంద‌రూ ఆరోగ్యం గా.. ఆర్ధికాభావృద్ధి తో.. శత్రు దోషాలను, న‌ర దృష్టి ని, మ‌నుషుల ఈర్ష ల‌ను తొల‌గిస్తుంది.

Also Read: తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం..

Visitors Are Also Reading