Home » చిరు, వెంకీ, నాగ్ కాంబోలో రావలసిన ఆ 100వ చిత్రం ఎందుకు ఆగిందో తెలుసా..?

చిరు, వెంకీ, నాగ్ కాంబోలో రావలసిన ఆ 100వ చిత్రం ఎందుకు ఆగిందో తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండవ తరం హీరోలలో నాగార్జున, వెంకటేష్ ,చిరంజీవి మంచి గుర్తింపు సాధించిన హీరోలు. ఈ ముగ్గురు హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి ఈ ముగ్గురు మూడు స్తంభాలాంటివారు. అలాంటి వీరి ముగ్గురితో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ ఆ స్టార్ డైరెక్టర్ చేయాలనుకున్నారట. ఎప్పుడు కొత్తదనం చూపించే రాఘవేంద్రరావు తన 100వ చిత్రం ఈ ముగ్గురు హీరోలతో కలిపి చేయాలని ప్లాన్ చేశారట. మరి ఆ కథేంటో పూర్తిగా చూద్దాం. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తన 98వ చిత్రంగా వచ్చిన శ్రీ మంజునాథ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. సినిమా మంచి టాక్ వచ్చిన కానీ అంతగా లాభాలు తీసుకురాలేదు. ఆ తర్వాత 99వ చిత్రం బాలీవుడ్ హీరో గోవిందతో రూపొందించారు.

also read:డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !

Advertisement

కానీ ఈ సినిమా కూడా అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేదు. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్ అయ్యేది ఉంటే తన 100వ చిత్రం భారీగా ప్లాన్ చేద్దాం అనుకున్నారట రాఘవేంద్రరావు.. ఆ విధంగా చిరంజీవి, వెంకటేష్ నాగార్జునతో త్రివేణి సంగమం అనే చిత్రాన్ని ప్లాన్ చేశారట. చిన్నికృష్ణను కథ రెడీ చేయమన్నారట. ఈ సినిమాను నిర్మించడానికి అశ్వినీదత్, అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. కానీ ఈ ముగ్గురు హీరోల సినిమాలు అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఏ మాత్రం అటు ఇటు అయినా ఫ్యాన్స్ మధ్య గొడవలు చెలరేగుతాయి. ఎలాంటి ప్రయత్నం వద్దని అశ్విని దత్ రాఘవేంద్రరావుకు సూచించారట. దీంతో రాఘవేంద్రరావు మనసు మార్చుకున్నారు. ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో మరో సినిమా చేయాలని భావించారట.

Advertisement

also read:హీరో గోపీచంద్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమాలు.

ఆ చిత్రం కూడా కొత్త వాళ్లతో తీయాలనుకున్నారట. ఆ సినిమా పేరు గంగోత్రి అని ఫిక్స్ చేశారు. కథ రెడీ చేసే బాధ్యత చిన్ని కృష్ణకు అప్పగించారు. ముందుగా హీరోగా రామ్ చరణ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ చిరునడిగితే చరణ్ కు ఇంకా మెచ్యూరిటీ రావాలని చెప్పారట. ఆ తర్వాత మోహన్ కృష్ణ తన అబ్బాయి తారకరత్నతో ఈ సినిమాలో హీరోగా పెట్టమని రాఘవేంద్రరావుకు చెప్పారట. ఇంతలోనే అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ ను హీరోగా పెట్టుకోమని సూచించారట. సినిమా నిర్మాత ఆయనే కాబట్టి ఆయన మాట కాదనలేక అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కు మంచి పేరు వచ్చింది.

also read:గురక పెట్టే వారిలో ఈ తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం.. జాగ్రత్త..!

Visitors Are Also Reading