Home » దేవాలయాల్లో వెన‌క భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

దేవాలయాల్లో వెన‌క భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణం గా ఎవ‌రూ దేవాల‌యాల కు వెళ్లిన గుడి ముందు దేవునికి మొక్కిన త‌ర్వాత‌.. వెన‌క భాగం లో కూడా మొక్కుతారు. ఈ సంప్రాదయాన్ని చాలా మంది పాటిస్తుంటారు. ఇలా ఎందుకు చెస్తారో అనే క్లారిటీ లేకున్నా.. చాలా మంది దేవాల‌యాల్లో వెనక భాగాన్ని మొక్కుతారు. కొంత మంది దేవుడికి ముందు తో పాటు వెనక నుంచి కూడా మొక్కితే పుణ్యం వ‌స్తుంద‌ని అంటారు. మ‌రి కొంద‌రు మాత్రం త‌మ త‌ల్లి దండ్రులు మొక్కుతున్నార‌ని మొక్కుతారు. అంతే కానీ ఎవ‌రి కీ కూడా స్ప‌ష్ట‌మైన కార‌ణం తెలియ‌దు. అయితే ఈ రోజు మ‌నం దేవాల‌యాల్లో వెన‌క భాగం ఎందుకు మొక్కుతారో చూద్దం.

Advertisement

దేవాల‌యం ముందు భాగం తో పాటు వెన‌క భాగం లో కూడా మొక్క‌డం అనేది ప్రాచిన కాలం నుంచే ఉంది. ఇలా వెన‌క భాగం లో కూడా మొక్క‌డానికి పెద్ కార‌ణమే ఉంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దేవాల‌యాల్లో మూల విరాట్టు ఉండే స్థలం గ‌ర్భాల‌యం ప్ర‌త్యేక మైన‌ది. గుడి లో ని గర్భాలయంలో మూల విరాట్టుని అన్ని గోడల మధ్య ప్ర‌తిష్టించ‌రు. కేవ‌లం దేవాల‌యం లో ని వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు.

Advertisement

 

అలాగే దేవాల‌యాల్లో విగ్రాహాల కు పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన దేవ‌డి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి శక్తి వ‌స్తుంది. దీని వ‌ల్ల దేవుని విగ్రహానికి ఒక ప్ర‌త్యేక మైన‌ ఆకర్షణ వ‌స్తుంది. దీంతో దేవుడి విగ్ర‌హం నుంచి భ‌క్తి కిర‌ణాలు నాలుగు దిక్కులా వ్యాప్తి చెందుతాయి. అయితే గ‌ర్భ గుడి లో ద‌గ్గ‌ర గా ఉండే వెన‌క గోడ కే మంత్ర శ‌క్తి ఎక్కువ గా వ‌స్తుంది. అందుకే వెన‌కాల గోడ కు ఒక శిల్పాన్ని చెక్కుతారు. అందుకే భ‌క్తులు వెన‌క భాగం కూడా మొక్కుతారు. ఇలా మొక్క‌డం వ‌ల్ల మూల విరాట్టును తో పాటు దేవుడి విగ్ర‌హాం నుంచి వ‌చ్చే మంత్ర శ‌క్తి కి కూడా పూజించిన‌ట్టు అవుతుంది.

Also Read: సాయితేజ కుటుంబానికి అండ‌గా మంచువిష్ణు..ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఫ్రీ ఎడ్యుకేష‌న్..!

Visitors Are Also Reading