Home » గాంధీ వర్ధంతి రోజు షహీద్ దివాస్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? 

గాంధీ వర్ధంతి రోజు షహీద్ దివాస్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? 

by Anji
Ad

జాతిపిత మహాత్మాగాంధీ గురించి భారతదేశంలో తెలియని వారు ఎవ్వరూ లేరు. ముఖ్యంగా అహింసా, సత్యాగ్రహాలే ఆయుదాలుగా దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అందించినటువంటి మహానీయుడు. ఆ మహనీయుడి వర్ధంతిని షహీద్ దివాస్ (అమరవీరుల దినోత్సవం) గా ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

“సర్వజన హితం నా మతం అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం” అని గాంధీజీ అన్న మాటలు ఇవి. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహానీయుడు. ఇదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు. 1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నిండా ద్వేషాన్ని నింపుకొని నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా.. గాంధీపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ.. ఆ మహనీయుడు అక్కడ ప్రాణాలు విడిచాడు. ఇవాళ గాంధీజీ 75వ వర్థంతి. మహాత్మగాంధీ వర్థంతిని దేశవ్యాప్తంగా షహీద్ దివాస్ గా జరుపుకుంటుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రక్షణ శాఖ మంత్రి అందరూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. 

Advertisement

గాంధీజీ రోజు చేసే ప్రార్థనల నుంచి బయటికి వస్తుండగా.. గాడ్సే గాంధీని కాల్చి చంపాడు. జాతిపితగా కీర్తించిన గాంధీ ప్రాణాలు అర్పించిన రోజు కావడంతో మార్టిర్స్ డే అనగా.. షహీద్ దివాస్ (అమరుల రోజు)గా జరుపుకుంటాం. గాంధీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించింది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడికి గుర్తుగా ఆయన వర్థంతిని షహీద్ దివాస్ గా జరుపుకుంటూ వస్తున్నాం.ఇక అదే సమయంలో స్వాతంత్య్ర సమర యోధులు, అమరవీరులు అయినటువంటి భగత్ సింగ్, శివరామ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు గుర్తుగా కూడా మార్చి 23న షహీద్ దివాస్ జరుపుకోవడం విశేషం.  

Also Read :  కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు…అది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే….!

Visitors Are Also Reading