టాలీవుడ్‌లో డైనమిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరిజగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మంచి దర్శకుడిగా పేరు పొందిన పూరిజగన్నాథ్. ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణీ అవుతున్న ఎంతో మంది హీరోలకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు సరైన సమయంలో హిట్ ఇచ్చి మంచి స్టార్ హీరోలుగా తీర్చిదిద్ది వాళ్ల కెరీర్ మలుపు తిప్పాడు. ఘన చరిత్ర ఉన్న పూరిజగన్నాథ్‌కు ప్రస్తుతం అన్నీ ప్లాప్స్ సినిమాలు పడుతున్నాయి.
పూరిజగన్నాథ్ ఎంతో మంది హీరోలకు మంచి సక్సెస్‌లను ఇచ్చినప్పటికీ తన కొడుకు ఆకాశ్‌పూరికి మాత్రం ఇప్పటివరకు ఒక విజయాన్ని కూడా అందించకలేకపోవడం గమనార్హం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నారు పూరి. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టి విషయం తెలిసినదే. ఈ తరుణంలోనే నటి ఛార్మితో కలిసి పూరిజగన్నాథ్ పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే.
Advertisement
Advertisement
ఈ తరుణంలో వీరిద్దరూ ముంబైలో కలిసి ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు డైరెక్టర్ పూరీకి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో పూరీ తన భార్యకు విడాకులు ఇచ్చేసి ఛార్మిని పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు హల్‌చల్ చేశాయి.
ఇలాంటి వార్తలపై పరోక్షంగా స్పందించారు పూరి కుమారుడు ఆకావ్ పూరి. ఆంధ్రపోరి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ మంచి విజయాన్ని అయితే సాధించలేకపోయాడు. కానీ నటనపరంగా మంచి మార్కులే వేయించుకున్నారు ఆకాశ్. రొమాంటిక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరింఇన ఛార్మి గురించి ఆకాశ్ పూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఛార్మి చాలా మంచి వారు. చాలా టాలెంట్ కూడా ఉన్నది. మా నాన్న ఛార్మికి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. నాన్నకు ఛార్మి చాలా సపోర్టివ్‌గా ఉంటారు. చెప్పాలంటే ప్రొడక్షన్ ఫీల్డ్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తారు. నాన్న దర్శకత్వం పనుల్లో బిజీగా ఉన్న ప్రతిసారి నిర్మాణరంగంలో ఛార్మి బాగా హెల్ప్ చేస్తారు. మంచి స్నేహబంధం ఉంది కాబట్టే మానాన్న ఛార్మిని వదలరు అని ఆకాశ్ చెప్పుకురావడం విశేషం.
Also Read: చిరంజీవి ‘డబుల్ హ్యాట్రిక్’ సినిమాలు ఏవో తెలుసా..?