Home » రామ్ చరణ్ కూతురును చూడడానికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదో తెలుసా ? 

రామ్ చరణ్ కూతురును చూడడానికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదో తెలుసా ? 

by Anji
Ad

ఇటీవలే మెగా ఫ్యామిలీలో సందడి ప్రారంభమైన విషయం తెలిసిందే. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి జరిగి 11 ఏళ్ల తరువాత సంతానం కలిగింది. మెగాస్టార్ చిరంజీవి తాత అయ్యారు. రామ్ చరణ్ తన కూతురుకి క్లిన్ కార అనే పేరు పెట్టారు. దీంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ కూతురు పుట్టి దాదాపు రెండు నెలలు కావస్తుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన గ్లోబల్ హీరో.. ఒకేసారి రెండు సంతోషాలు.

Advertisement

 

ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఒకటి అయితే.. మరొకటి తనకు పాప పుట్టడం. వాస్తవానికి పాప పుట్టడం అనేది మెగా ఫ్యామిలీలో అందరూ చాలా సంతోషానికి గురయ్యే విషయం. ఆర్ఆర్ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనే విషయం తెలిసిన విషయమే. అయితే వీరిద్ధరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అయినా కూడా రామ్ చరణ్ కి కూతురు పుడితే ఇప్పటి వరకు ఆమెను చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదట. అదేంటి..? వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. మరీ రామ్ చరణ్ కూతురును చూడటానికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న మొదలైంది. దానికి ఓ పెద్ద కారణమే ఉందడోయ్. 

Advertisement

ఇది అసలే వర్షాకాల సీజన్.. ఈ సీజన్ లో చిన్నపిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ప్రస్తుతం తారక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆయన తన షూటింగ్ లో భాగంగా చాలా మందిని కలుస్తుంటారు. దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతుంటుంది. అందుకే ఇప్పటివరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూతురును చూడటానికి వెళ్లలేదట.వాస్తవానికి మెగా ఫ్యామిలీ కూడా ఇప్పట్లో తమ గారాల పట్టిని ఎవ్వరికీ చూపించలేదు. బయటి వారిని ఇంట్లోకి రానివ్వడం లేదని టాక్. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటివరకు క్లిన్ కారాను చూశారు. అందుకే ఎన్టీఆర్ కూడా వెళ్లలేదట. కొద్ది రోజుల్లో వెళ్లి చూసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రీ రిలీజ్ సినిమాలు మరీ టూ మచ్.. ఇలా అయితే ఎలా ?

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవే.. ఏంటో చూడండి!

 

Visitors Are Also Reading