సాధారణంగా “అల్లం’ ని ప్రతీ వంటకాలలో వినియోగిస్తుంటాం. మొగల్ చక్రవర్తులు అల్లాన్ని సోంత్ అని పిలిచేవారు. చాలా రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఇప్పటికీ కూడా అలాగే పిలుస్తున్నారు. భారతీయ సుగంధ ద్రవ్యాలలో అల్లం ఒకటి. అల్లము వాస్తవానికి చైనాలో పుట్టిందని చెబుతుంటారు. కొంతమంది మాత్రం భారతదేశంలోనే పుట్టిందని అంటుంటారు. మొగల్ చక్రవర్తులకు ఎండు అల్లం అంటే చాలా ఇష్టమట. క్రీస్తుపూర్వం ఏడు, ఎనిమిది శతాబ్దాలలో రచించిన ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహితం’ లో హరిద్వర్గ అధ్యాయంలో సోంత్ గురించి ప్రస్తావన ఉంది.
Advertisement
చైనా నుంచి భారతదేశానికి వచ్చిన బౌద్ధ సన్యాసి షాహియాను తన పుస్తకంలో అల్లం గురించి వివరించాడు. భారత్ చైనా దేశాల్లో దాని సాగు గురించి చెప్పాడు. ఈ రెండు దేశాల వల్లనే అల్లం ప్రపంచ దేశాలు అన్నింటికీ వ్యాప్తి చెందిందని వివరించాడు. భారతదేశంలోనే అల్లం ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అమెరికా సౌదీ అరేబియా వంటి దేశాలకు భారత్ నుంచే ఎగుమతి అవుతోంది అల్లం. మొగల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఆగ్రహాలు అల్లాని ఎక్కువగా పండించే విధంగా చేశారు. ఆగ్రా నుంచి లాహోర్ కి రవాణా కూడా చేసేవారు. ఆయుర్వేదంలో ఎండు అల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని పలు ఔషధాలలో ఉపయోగిస్తారు. పొడి రూపంలో, కషాయం రూపంలో మాత్రమే కాకుండా.. రకరకాలుగా ఆయుర్వేదంలో ఎండు అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లం పొడి గుండెకు చాలా మేలు చేస్తుంది. క్యాన్సర్ నివారణ కూడా పనిచేస్తుంది. ఆహారం ప ఆసక్తి కలిగే విధంగా చేస్తుంది. ఆయుర్వేదము ఎందువల్లని రోజు ఉపయోగించాలని సూచిస్తుంది.
Advertisement
Also Read : శీతాకాలంలో వాకింగ్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తప్పనిసరి..!
అల్లంతో ఇంటి చిట్కాలు
- కడుపులో బాగా మంటగా వచ్చినప్పుడు అల్లం పొడిని కాస్త గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే వెంటనే ఆ సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.
- గొంతు నొప్పి లేదా తలనొప్పి చికిత్స కోసం కూడా అల్లాని ఉపయోగించవచ్చు. రెండు అల్లం పొడిని ఓ పేస్టులా తయారు చేసి తలపై అప్లై చేసుకుంటే గొంతు పైన అప్లై చేసుకున్న నొప్పి తగ్గుతుంది.
- జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలగాలంటే ఎండు అల్లం పొడిలో కాస్త బెల్లం కలిపి భోజనం చేసిన తర్వాత తింటే ఉపశమనం కలుగుతుంది.
- ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పొడి అల్లం చాలా మేలు చేస్తుంది. ధర్మోజనిక్ ఏజెంట్లు అంటే వేడిని పెంచే పదార్థాలు ఉంటాయి. అల్లం పొడి శరీరంలోని కొవ్వుని కాల్చి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.