వసంత రుతువు శోభకు సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగే హోలీ. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఫాల్గుణ పౌర్ణమి రోజు రంగులను చిలుకరించుకుంటారని లింగపురాణం ప్రస్తావించింది. ఫాల్గుణ పౌర్ణమికి అటుఇటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సంబంధితమైన వేడుకలను నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. సామాజిక సమైక్యతను సమిష్టి భావనను ఈ పండుగే వ్యక్తీకరిస్తుంది. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధీకాలంలో జరుపుకునే ఈ పండుగ విశేషాలను భవిష్య, నారద పురాణాలతో గాథ సప్తశతి, మాళవికాగ్ని మిత్రం, నాగావళి వంటి గ్రంథాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హోలీని వసంతోత్సవం, మధూత్సవం, మదనోత్సవం, కాముని పున్నమి, డోలోత్సవం, కృష్ణగోపికా ప్రేమోత్సవం అని పిలుస్తారు.
హోలీతో ముడిపడి ఉన్న కథ కామ దహనం. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని ఈశ్వరుడు తన మూడవ కన్ను తెరిచి ఫాల్గుణ పౌర్ణమి రోజు భస్మం చేశాడని శివమహా పురాణం పేర్కొంది. ఈ ఘట్టమే కుమారసంభవానికి, తారకాసుర సంహారానికి ప్రాతిపదిక అగ్ని సైతం దహించలేని మహాశక్తిమంతు రాలైన హోలిక, హిరణ్యకశిపుడి సోదరి హరి స్మరణ వీడని తన కుమారుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయాలని హిరణ్యకశిపుడు తన సోదరిని ఆదేశిస్తాడు. హరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శ వల్ల హోలిక శక్తి పూర్తిగా క్షీణించి ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లదుడు అగ్నికీలల నుంచి క్షేమంగా బయటకు వస్తాడు. హోలిక దగ్దమైన పాల్గున పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమి అంటారు.
Advertisement
Advertisement
కృతయుగంలో దుంధ హోలీ జరుపుకునే సంప్రదాయం ఏర్పడిందని చండీతంత్రం వివరించింది. మధుర మీనాక్షి తపోదీక్షతో సుందరేశ్వర స్వామిని మెప్పించి ఫాల్గుణ పౌర్ణమినాడు వివాహమాడిందని చెబుతారు. అందుకే దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో కల్యాణవ్రతం పేరున హోలీ రోజు శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించి హోలికా మిశ్రమాన్ని నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఫాల్గుణ పౌర్ణమి నుంచి చైత్ర పౌర్ణమి వరకు నెలరోజుల పాటు మామిడిపూత, వేచిగుళ్ల, తేనే కలిపిన హోలికా మిశ్రమం స్వీకరించడం వల్ల వేసవి తాపం తొలగుతుందని చరక సంహిత తెలియజేస్తోంది. హోలీ పండుగ రోజు కూడళ్లలో పెద్ద జ్వాలను ఏర్పాటు చేసి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ఈ భస్మాన్ని ధరించడం వల్ల సకల సానుకూల శక్తులు పెంపొంది, ప్రతికూల శక్తులు దూరమవుతాయని విశ్వాసం. రాధాకృష్ణుల రసరమ్య భావనా వాహినికి సంకేతంగా హోలీపర్వం ఉత్తర భారతాన డోలాజాత్రాగా వెల్లివిరుస్తుంది. ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజులను హోలాష్టకంగా అభివర్ణిస్తారు. అష్టదిక్పాలకులను, నవ గ్రహాలను దశమహా శక్తులను ఈ ఎనిమిది రోజుల పాటు నవధాన్యాలతో పూజించే ఆచారం ఉంది. హోలీ రోజు దేవతలకు ఉద్వాసన పలికి, వారి మూర్తులపై పన్నీరు కలిపిన చందనాన్ని విశ్వసిస్తారు. ప్రైమైక జీవన సౌందర్యాన్ని సమైక్య భావనా మాధుర్యాన్ని ప్రమోదంగా ప్రకటించే పర్వమే రంగుల హోలీ..!
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి