వైద్యం గురించి తెలుసుకునే చిన్న చిన్న విషయాలను కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నించం. అలాంటి విషయమే ఒకటి ఇంజెక్షన్, నరాలకు చేయడం లేదా శరీర అవయవాలకు చేయడం. ఇంజెక్షన్‌ను బట్టి ఈ విధంగా చేస్తుంటారు. అసలు అలా చేయడానికి కారణమేమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇంజెక్షన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనం చూసేది మాత్రం కేవలం రెండు రకాలకు చెందిన ఇంజక్షన్లను మాత్రమే. ఒకటి కండరాలకు వేసేది. మరొకటి నరాలకు వేసేది. ఏ మందునైనా మనం నోటి ద్వారా కడుపులోకి తీసుకుంటే అది జీర్ణవ్యవస్థ నుంచి పీల్చుకుని ఆ తరువాత అది జీర్ణవ్యవస్థ నుంచి పీల్చుకుని రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అయి మనకు రోగాన్ని నయం చేస్తుంది. మనిషి నోటి ద్వారా మందు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఆ మందులు జీర్ణవ్యవస్థకు హాని కలిగించే అవకాశం ఉన్న సమయంలో జీర్ణ వ్యవస్థలో వాటి శక్తిని కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇంజెక్షన్‌తో కండరాల ద్వారా రక్తంలోకి మందును పంపిస్తారు.
Advertisement
ఈ విధంగా చేయడాన్ని కండరాలకు చేసే ఇంజెక్షన్ అని అంటారు. ఈ ఇంజక్షన్ ద్వారా మందు నోటి ద్వారా తీసుకునే దానికన్నా త్వరగా ఉపయోగముంటుంది. మరో ఇంజక్షన్ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో మందు చాలా త్వరగా శరీర అవయవాలకు చేరాల్సిన అవసరం ఉంటే దాన్ని నరాల ద్వారా పంపితే వెంటనే అది పని చేస్తుంది. అప్పుడు మందును ఇంజక్షన్‌తో నరాల ద్వారా రోగి శరీరంలోకి పంపిస్తారు. రోగి తినలేని పరిస్థితిలో ఉన్నా కూడా పోషక పదార్థాలను ఇంజక్షన్ సాయంతో శరీరంలోకి పంపిస్తారు.
Also Read :
ఉదయభాను అకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం అదేనా..?
ఈ హీరోల మధ్య ఉన్న పోలికలను మీరు ఎప్పుడైనా గమనించారా..?