Home » మానవుల రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

మానవుల రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

by Anji
Ad

మానవ రక్తం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగం. ఇది కణాలకు ఆక్సిజన్‌ను అందించడానికి పనిచేస్తుంది. రక్తం లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు. అయితే రక్తం ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది? సిరల రంగు ఎందుకు ఎర్రగా ఉండదు? రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి? అనే సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? ఈ ప్రశ్నలకు నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ హెమటాలజీ అండ్ బ్లడ్ డిజార్డర్స్ డిపార్ట్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రియాంషీ పచౌరి ఈ విధంగా సమాధానం చెబుతున్నారు.

Advertisement

మన శరీరంలో రెండు రకాల కణాలు ఉంటాయి. వీటిల్లో ఒకటి తెల్ల రక్త కణాలు, మరొకటి ఎర్ర రక్త కణాలు . ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని ఐరన్‌తో కలవడం వల్ల దాని రంగు ఎరుపుగా మారుతుంది. మన రక్తంలో మిలియన్ల కొద్దీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాని కారణంగా మన రక్తం రంగు ఎరుపుగా మారుతుంది. ఒక వ్యక్తి శరీరంలో ఎర్రరక్త కణాలు తక్కువగా ఉంటే అతని శరీరం నీలం రంగులో కనిపించడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా విషం ఇచ్చినప్పుడు, అది వారి రక్తంలో కలిసిపోతుంది. వెంటనే వారి శరీరం రంగు నీలం రంగులోకి మారుతుంది. మన శరీరంలో రక్తం తగినంత మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం.

Advertisement

రక్తహీణత వల్ల అనేక తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి శరీరం అయినా నీలం రంగులో ఉన్నట్లు గమనించినట్లయితే, అతను వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలో రెండు రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి. వీటిలో ఒకటి WBC, మరొకటి ప్లేట్‌లెట్. WBCలు మన శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. రక్తస్రావం నివారించడానికి మన శరీరానికి ప్లేట్‌లెట్స్ అవసరం. డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు మన శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading