రెబల్ స్టార్ హీరో ప్రభాస్-స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సలార్. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే సలార్ మూవీ పై ఇప్పటిదాకా ఉన్న అంచనాలు ఒక ఎత్తు అయితే, సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక పెరిగిన అంచనాలు మరొక ఎత్తు. ఇక మరి కొద్ది గంటల్లో మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఎందుకు డార్క్ థీమ్ లోనే ఉంటాయి.? అనే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే దాని వెనక ఓ ప్రత్యేకమైన రీజన్ ఉందట. ప్రశాంత్ నీల్ కు ఉన్న ఓ జబ్బు కారణంగానే ఆయన సినిమాలన్నీ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటాయట. ఇంతకీ ప్రశాంత్ కు ఉన్న జబ్బు ఏంటి? సిరీస్ KGF ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. రెండు పార్ట్స్ గా థియేటర్ల లోకి వచ్చిన కేజీఎఫ్ మూవీకి విశేషమైన ఆదరణ లభించింది. దానికి కారణం కథ, కథనం టెక్నీషియన్ల పనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ఎన్నో ఉన్నప్పటికీ అన్నింటికంటే ప్రత్యేకమైనది సినిమా బ్యాక్ గ్రౌండ్ థీమ్. ఈ మూవీ గ్రే కలర్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను చూశాక సరికొత్త వైబ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ ఇండియాకు మాత్రం ప్రశాంత్ దీన్ని పరిచయం చేశాడు ఇక ఆ మూవీ హడావిడి అయిపోయాక ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్త బయటకు రాగానే హైప్ భారీగా పెరిగిపోయింది. అయితే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని కంప్లీట్ సినిమా అంతా కేజీఎఫ్ లాగే డార్క్ థీమ్ తో ఉండటంతో అందరూ థ్రిల్ ఫీలయ్యారు.
కానీ కొంతమందికి మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఇలా ఒకే బ్యాక్ గ్రౌండ్ థీమ్ తో ఎందుకు ఉంటాయి అనే డౌట్ వచ్చింది. ఆ ప్రశ్నకు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు ప్రశాంత్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. సలార్, కేజిఎఫ్ ఒకేలా కనిపించడానికి తనకు ఉన్న ఓసిడినే కారణం అని చెప్పుకొచ్చాడు. ఎక్కువ రంగు ఉన్న బట్టలు నేను వేసుకోను. అలాగే నా వ్యక్తిత్వమే మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. భువన్ గౌడ కూడా అలాంటి గ్రే కలర్ ప్యాలెట్ లోనే షూటింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ఇక నేను కూడా అలాంటి స్టైల్ సినిమాలు చేస్తే బాగుంటుందని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దాని అర్థం ఏమిటంటే చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాలనిపించడం. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ప్రశాంత్ నీల్ కు ఎక్కువ రంగులు వాడటం ఇష్టం ఉండకపోవడంతో తన సినిమాలను ఇలా బ్లాక్ థీమ్ లోనే తీస్తున్నాడు అన్నమాట.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!