Home » విమానాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా ?

విమానాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా ?

by Anji
Ad

ప్రపంచంలోనే చాలా విమానాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇది ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా విమానాయాన సంస్థలు విమానంలో తమ లోగో, ట్రేడ్ మార్క్ ని ఉపయోగిస్తాయి. కానీ దాని అసలు రంగును ఎప్పుడు మార్చారు. ఇందుకు శాస్త్రీయ, ఆర్థిక కోణం ఉంది. విమానం తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని  మనం ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

ప్రయాణికుల విమానాలు ఎల్లప్పుడూ తెలుపు రంగులో ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఈ విమానాలు మరే ఇతర రంగులో ఎందుకు తయారు చేయబడవు? నిజానికి తెలుపు రంగు సూర్యకాంతి లేదా దాని వేడిని ప్రతిబింబిస్తుంది. వేసవిలో తెల్లని దుస్తువులు ధరించి బయటకు వెళ్లడం వల్ల వేడి ప్రభావం మనపై ఉండదు. అందుకే తెలుపు రంగు కాకుండా నలుపు రంగు వేసుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. నలుపు లేదా ఏదైనా ఇతర రంగు తెలుపు కంటే తక్కువ కాంతిని ప్రతిబింబిస్తుంది. అదే లాజిక్ ప్లేన్ లో కూడా అదే పని చేస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం దానిపై పడే సూర్య కిరణాలను చాలా వరకు ప్రతిబింబిస్తుంది.

ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. విమానం లోపలి ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. విమానాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇందులో చిన్న సమస్య వచ్చినా ఆ ప్రభావం విమానంపై పడుతుంది. దీంతో పెద్ద ప్రమాదానికి కారణంగా మారుతుంది. విమానంలో అతి చిన్న డ్యామేజ్ లేదా డెంట్ ను కూడా గుర్తించి దాన్ని పరిష్కరించటం చాలా ముఖ్యం. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగులో డెంట్లు సులభంగా కనిపిస్తాయి. విమానాలు రూపకల్పనలో కంపెనీలు తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం.

Advertisement

 


తెలుపు రంగును తేలికైన రంగు అంటారు. ఇతర రంగుల కంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత తెలుపు రంగుకు ఇవ్వడానికి ఇదే కారణం. ఇది కాకుండా.. దాని దృశ్యమానత కూడా స్పష్టంగా ఉంది. ఈ రంగు చీకటిలో కూడా సులభంగా కనిపిస్తుంది. దీంతో ఆకాశంలో ప్రమాదం జరిగే అవకాశం తగ్గుతుంది. మీరు తెలుపు రంగు ఒక ప్రత్యేకతను కూడా గమనించి ఉండాలి. ఇది ఎప్పటికీ మసకబారదు. విమానానికి తెల్లటి రంగు వేయడానికి ప్రధాన కారణం సూర్యకిరణాలు దాని తెలుపు రంగు కారణంగా సూర్యుని కిరణాల కాంతి పరావర్తనం చెందుతుంది. ఇది జరిగినప్పుడు విమానం లేదా దాని బాడీ ఉష్ణోగ్రత పెరగదు. తెలుపు రంగుకు బదులుగా మరొక రంగును ఉపయోగిస్తే.. సూర్య కిరణాలను విమానం గ్రహిస్తుంది. దాని బాడీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రెండవ కారణం ఏమిటంటే , విమానాన్ని తెలుపు రంగు వేయడం ద్వారా.. ఇది సోలార్ రేడియేషన్ వల్ల వేడెక్కడం, దెబ్బ తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

ఇది కూడా అవసరం ఎందుకంటే విమానాలు కేవలం ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే ప్రయాణించవు. కానీ అవి గంటల తరబడి ఎండలో రన్ వేపై నిలబడి ఉంటాయి. అందువల్ల తెలుపు రంగు అటువంటి సమస్యల నుండి రక్షిస్తుంది. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం, విమానం రంగు తెల్లగా ఉన్నప్పుడు విమానానికి జరిగిన నష్టాన్ని సులభంగా చూడవచ్చు. ఇది జరిగినప్పుడు మెయింటెనెన్స్ చేయడం సులభం అవుతుంది. ఇది కాకుండా, తెలుపు రంగు పక్షులను విమానాన్ని ఢీ కొట్టకుండా నిరోధిస్తుంది. ముదురు రంగు కారణంగా.. ప్రమాదాన్ని గుర్తించడం కష్టంగా మారుతుంది.

 

Visitors Are Also Reading