ఇటీవల కేంద్ర ప్రభుత్వం భార్త, భర్తలపై ఓ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగేటప్పుడు భర్త వయస్సు కంటే భార్య వయస్సు తగ్గే విధంగా ఉండేటట్టు.. భర్తకు ఎక్కువగా ఉండేటట్టు చూస్తుంటారు.
Advertisement
వివాహం చేసేటప్పుడు ఎందుకు అలా ఉండేవిధంగా చూస్తుంటారనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ వృద్ధులు అయిపోయినప్పుడు భర్తను చూసుకోవడానికి భర్త అవసరాలను తీర్చడానికి భార్య ఓపికగా ఉండాలి. అందుకే భార్య వయస్సు చిన్నగా ఉండాలని, అలాగే ఎక్కువగా భార్య, భర్తల మధ్య గొడవల రావడానికి కారణం ఈగో. వాళ్లు చెబితే నేను వినడం ఏమిటి.. అనే అహం కూడా ఉంటుంది. ఇక ఇద్దరికీ వయస్సులో తేడా ఉంటే ఆలోచనలలో కూడా తేడానే వస్తుంటుంది.
Advertisement
అదేవిధంగా మరొక కారణమేమిటంటే.. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అయితే మరీ ఎక్కువ తేడా ఉన్నా కూడా ఇబ్బందికరమే. దాదాపు 2 నుంచి 7 ఏళ్లకంటే ఎక్కువగా తేడా ఉంటే కూడా సమస్యతొస్తాయి. మహిళలు కొంచెం బాగా ఆలోచిస్తారు. అందుకే ఆలోచన విధానంను దృష్టిలో పెట్టుకుని వయస్సు భేదం చూస్తారని.. అలాగే మహిళలలో మానసిక బలం ఎక్కువగా ఉంటుందని, భర్త చనిపోతే భార్య తట్టుకోగలరని.. కానీ భార్య చనిపోతే భర్త తట్టుకోలేడు. ఇలా వీటన్నింటిని చూసి వయస్సు భేదం పెట్టారని తెలుస్తోంది.
అయితే ఇటీవల అమ్మాయిల వయస్సును 18 నుంచి 21 ఏళ్లు అని ప్రకటించారు. ముఖ్యంగా బాల్యవివాహాలు ఆగడం లేదు. 1978లో అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో తీసుకొచ్చారు. ఆ చట్టంలో బాల్యవివాహం జరిపినట్టయితే నేరంగా పరిగణించారు. అయినా యూనెస్కో లెక్కల ప్రకారం.. బాల్యవివాహ బాధితులలో మూడింట ఒక వంతు మంది భారత్‌లోనే ఉండడం గమనార్హం. తాజాగా అమ్మాయి వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తుంటే.. మరికొందరూ సమర్థిస్తున్నారు.
Also Read: ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్