Home » ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్

ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్

by Bunty
Ad

ఆధార్ ఫర్ కిడ్స్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డులను అందజేసేందుకు ఆధార్ కార్డు తయారీ సంస్థ యుఐడిఎఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఆసుపత్రుల్లో ఎన్రోల్మెంట్ ప్రారంభించనున్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే పిల్లల జనన ధ్రువీకరణ పత్రం రాకముందే వారికి ఆధార్ కార్డు ఉంటుంది. సాధారణంగా జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. యు డి ఐ ఏ ఎల్ ఐ సి ఈ ఓ సౌరబ్ వార్త సంస్థ ఏ ఎన్ ఐ తో మాట్లాడుతూ.. నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి రిజిస్టర్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వయోజన జనాభాలో 99.7% మంది ఆధార్ పరిధిలోకి వచ్చారని చెప్పారు.

Advertisement

ఇప్పటివరకు దేశంలో 131 కోట్ల మంది జనాభా నమోదు చేసుకున్నారన్నారు. ఇప్పుడు తమ ప్రయత్నం నవజాత శిశువుల ను చేర్చుకోవడం అని చెప్పారు. ఏటా 2 నుంచి 2.5 కోట్ల మంది పిల్లలు పడుతున్నారన్నారు. వాటిని ఆధార్ నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామని బిడ్డ పుట్టినప్పుడు అతని ఆమె ఫోటో ని క్లిక్ చేయడం ద్వారా ఆధార్ కార్డు ఇస్తామని వెల్లడించారు. వివరాలను అప్డేట్ చేయడం ఈ విషయంపై మరింత వివరంగా చెబుతూ మేము ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బయోమెట్రిక్ తీసుకోము కానీ దానిని వారి తల్లిదండ్రుల్లో ఒకరు 5 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల బయోమెట్రిక్ తీసుకుంటాము అని చెప్పారు. మొత్తం జనాభా ఆధార్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఏడాది మారుమూల ప్రాంతంలో పదివేల శిబిరాలు ఏర్పాటు చేశామని అక్కడ చాలామంది కి ఆధార్ నంబర్లు లేవని చెప్పారు.

Advertisement

ఈ కసరత్తు లో 30 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 2010 లో మొదటి ఆధార్ నెంబర్ను జారీ చేశామని మొదట వీలైనన్ని ఎక్కువ ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడం పైనే తన దృష్టి ఉండేదని చెప్పారు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయడం పైనే దృష్టి ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం దాదాపు పది కోట్ల మంది తమ పేరు చిరునామా మొబైల్ నెంబర్లను అప్డేట్ చేస్తున్నారు.

140 కోట్ల బ్యాంకు ఖాతాల్లో 120 కోట్ల ఖాతాలు ఆధార్తో అనుసంధానం అయ్యాయని వివరించారు ఓటర్ కార్డు ఆధార్ను అనుసంధానం చేయనున్నారు. రానున్న కాలంలో ఓటర్ కార్డు తో కూడా ఆధార్ను అనుసంధానం చేయనున్నారు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఓటింగ్ నిరోధించడమే దీని ఉద్దేశం ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Visitors Are Also Reading