Home » ‘కీడా కోలా’ సినిమాలో బ్రహ్మనందం క్యారెక్టర్ మిస్ చేసుకున్న ఆ స్టార్ నటుడు ఎవరో తెలుసా ?

‘కీడా కోలా’ సినిమాలో బ్రహ్మనందం క్యారెక్టర్ మిస్ చేసుకున్న ఆ స్టార్ నటుడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మనందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం కామెడీ కాస్త తగ్గినా.. దాదాపు 20 ఏళ్ల నుంచి బ్రహ్మానందం కామెడీ ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. తాజాగా తరుణ్ భాస్కర్, చైతన్యరావు, బ్రహ్మనందం, రఘురామ్, రాగ్ మయూర్, జీవన్ విష్ణు తదితర నటీనటులు కీలకపాత్రల్లో నటించిన చిత్రం కోడాకోలా. నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా వ్యవహరించి ఈ మూవీకి ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ ను తొలుత ఓ స్టార్ నిర్మాతకి ఆఫర్ చేశారట. అసలు ఆయన ఎవరు.. ఎందుకు చేయలేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కీడాకోలా ఈ సినిమాని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 800 స్క్రీన్లలో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో 400 స్క్రీన్లలో విడుదల చేయగా.. ఇండియాలో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం విడుదలైన తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కీడాకోలా మూవీలో బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రకు స్టార్ నిర్మాతను అనుకున్నారట.

Advertisement

ఇక ఆయన మరెవ్వరో కాదు.. అల్లు అరవింద్ ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అనుకున్నాడట. కానీ ఆ పాత్రను బ్రహ్మానందంతో చేయించాడు దర్శకుడు. కీడా కోలీ స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులుపాత్రను అల్లు అరవింద్ గారితో చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ భావించాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. రానాతో ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. అయితే అల్లు అరవింద్ వద్దకు వెళ్లి మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. సింపుల్ గా నవ్వి రిజెక్ట్ చేశారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మానందం చేశారని తెలుస్తోంది. ఈ మూవీ విషయానికొస్తే.. డిపరెంట్ జోనర్ కీడాకోలా తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ఫన్ ఎంటర్ టైనర్ గా  ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ కి మంచి ఆదరణ లభించింది. మరోవైపు అల్లు అరవింద్ రిజెక్ట్ చేయడం సరైందేనని కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading