ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ని వరించింది. గత ఏడాది బెన్ స్టోక్స్ అద్బుతమైన ఆట ప్రదర్శించడంతో ఈ గౌరవం దక్కింది. జో రూట్ తరువాత ఇంగ్లండ్ జట్టు సారధిగా బాద్యతలు చేపట్టిన ఈ ఆల్ రౌండర్ ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్ గా తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు బెన్ స్టోక్స్.
Advertisement
ముఖ్యంగా బ్రెండన్ మెకల్లమ్ తో కలిసి బజ్ బాల్ విధానంతో సంప్రదాయ క్రికెట్ లో కూడా విధ్వంసకర ఆట తీరుతో జట్టును విజయపథంలో నడుపుతున్నాడు స్టోక్స్ . వ్యక్తంగతంగానూ.. ఉత్తమంగా రాణిస్తూ.. పలు రికార్డులను సృష్టిస్తున్నారు. గత ఏడాది టెస్ట్ ల్లో మొత్తంగా 870 పరుగులు సాధిచాడు. ఇందులో రెండు శతకాలున్నాయి. అదేవిధంగా 26 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్.
Advertisement
ఇంగ్లండ్ కి సారథ్యం వహించిన 10 మ్యాచ్ లలో తొమ్మిది విజయాలను సాధించాడు. ఇలా ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించింది. ఐసీసీ టెస్ట్ జట్టుకు బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికైన విషయం విధితమే. ఇది ఇలా ఉంటే.. టీమ్ ఇండియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 సంవత్సరానికి ఐసీసీ పురుషుల టీ-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. ఈ స్థానం సాధించినటువంటి మొదటి భారత బ్యాట్స్ మెన్ గా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లీషు బ్యాట్స్ మెన్ సామ్ కుర్రాన్, పాకిస్తానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ జా కూడా ఐసీసీ టైటిల్ కోసం పోటీ పడిన వారిలో ఉన్నారు.