Home » KL రాహుల్ దంపతులకు కోహ్లీ, ధోనీ ఖరీదైన గిప్ట్

KL రాహుల్ దంపతులకు కోహ్లీ, ధోనీ ఖరీదైన గిప్ట్

by Bunty
Ad

టీంఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక ఇంటి వాడయ్యాడు. కొన్నేళ్లుగా తాను ప్రేమిస్తున్న సినీ నటి అథియాశెట్టిని సోమవారం వివాహం ఆడాడు. మహారాష్ట్రలోని ఖండాలాలో అథియాశెట్టి తండ్రి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాహుల్, అథియాశెట్టి ఒక్కటయ్యారు.

Advertisement

పెళ్లి అనంతరం ఈ జంట బయటవేచి చూస్తున్న వీడియో ప్రతినిధుల ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తమ పెళ్ళి ఫోటోలను రాహుల్, అథియాశెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకున్నారు. కేఎల్ రాహుల్, అథియాశెట్టి దంపతులకు బాలీవుడ్ యాక్టర్స్, భారత క్రికెటర్ల నుంచి ఖరీదైన గిఫ్ట్స్ వచ్చాయట. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓ ఖరీదైన బైక్ ని గిఫ్ట్ గా పంపించారట.

Advertisement

అలానే భారత క్రికెటర్ల నుంచి కూడా కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు కేఎల్ రాహుల్ సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి హీరో సల్మాన్ ఖాన్ ఈ నూతన దంపతులకు రూ.1.64 కోట్లు విలువైన ఆడి కారుని ఇచ్చారట. యంగ్ హీరోలు అర్జున్ కపూర్ డైమండ్ నెక్లెస్, జాకీశ్రాప్ 30 లక్షల విలువైన వాచ్ ని అథియాశెట్టికి గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే బాలీవుడ్ లోని సునీల్ శెట్టి ఫ్రెండ్స్, అతియా ఫ్రెండ్స్ కొన్ని ఖరీదైన గిఫ్ట్స్ ని ఈ నూతన వధూవరులకి ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : RRR : “నాటు, నాటు” పాట డ్యాన్స్ మాస్టర్ గురించి తెలుసా? అతను ఓ టైలర్ షాప్ ఓనర్

Visitors Are Also Reading