Home » ICC ODI Rankings : కివిస్ పై క్లీన్ స్వీప్…3 ఫార్మాట్లలోనూ టీమిండియాదే అగ్రస్థానం !

ICC ODI Rankings : కివిస్ పై క్లీన్ స్వీప్…3 ఫార్మాట్లలోనూ టీమిండియాదే అగ్రస్థానం !

by Bunty

 

న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 114 రేటింగ్ పాయింట్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా 90 పరుగులతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ కు ముందు 112 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్, తాజా విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండు స్థానాలను ఏకబాకింది. ఈ క్రమంలో ఇంగ్లాండును వెనక్కు నెట్టింది. మూడు మ్యాచ్ ల్లో ఓడిన న్యూజిలాండ్ 111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో ప్రస్తుతం టి20ల్లో, వన్డేల్లో టీం ఇండియా నెంబర్ వన్ గా ఉంది. ఇక టెస్టుల్లోను అగ్రస్థానం అందుకుంటే, ముచ్చటగా మూడు ఫార్మాట్ లను ఏకకాలంలో నెంబర్ వన్ గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది.

బహుశా ఇంతకు ముందు ఎన్నడూ మూడు ఫార్మాట్లో ఓకే జట్టు నెంబర్ వన్ గా లేదన్నది సమాచారం. తాజాగా ఆ అవకాశం టీమ్ ఇండియాకు లభించనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా గెలిస్తే గనుక టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును పొందుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా రెండో స్థానంలో ఉంది. సిరీస్ ను క్లీన్ చేయకపోయినా, 2-1 తేడాతో నెగ్గిన టీమిండియా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

READ ALSO : Pathaan Movie Review : “పఠాన్” మూవీ రివ్యూ

Visitors Are Also Reading