సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీల ఆదాయాలు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎంత హై రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు అయితే ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను షేక్ చేస్తున్నారు. అలాగే ఇతర వ్యవహారాలలో అర్జించే ఆదాయం, ఇతర రంగంలో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాల వల్ల ప్రతి సంవత్సరం సెలబ్రిటీల ఆదాయం భారీగా పెరుగుతూ ఉంటుంది.
కానీ కొంతమంది సెలబ్రిటీలు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగ్గొడుతూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు స్టార్ సెలబ్రిటీల ఇంట్లో ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మన మెగా హీరో రామ్ చరణ్ మాత్రం ఇండస్ట్రీలో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఆయన ఎక్కువగా ఇన్ కమ్ టాక్స్ పే చేస్తున్నారట. అదెలా అంటే.. ఆయనకి పలు బిజినెస్ ల ద్వారా చాలా మొత్తం ఆస్తి రావడమే కారణం అంటూ చెప్పుకుంటున్నారు జనాలు. అలాగే రామ్ చరణ్ కి తన తండ్రి ఆస్తితో పాటు ఉపాసన ఆస్తి కూడా కలిసి వచ్చింది. అంతేకాకుండా ఆయన సొంతంగా కష్టపడిన ఆస్తి 1370 కోట్ల రూపాయలు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement
ప్రస్తుతం చరణ్ ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే చెర్రీకి ఇంత ఆస్తి రావడానికి కారణం ఆయన ఓ విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టడమే. అంతేకాకుండా కొణిదెల ప్రొడక్షన్ సంస్థకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా పలు యాడ్స్, బిజినెస్, సినిమాలపరంగా చెర్రీ ఆస్తి 1375 కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో అత్యధికంగా టాక్స్ కడుతున్న సెలబ్రిటీలలో మన చెర్రీ ఒకరు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!