Home » ఉపేంద్రను ప్రేమించి మోసం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా…?

ఉపేంద్రను ప్రేమించి మోసం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా…?

by Bunty

 

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కన్నడలో ఉపేంద్ర తిరుగులేని వ్యక్తిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇతను కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో పనిచేశాడు. ఇతని నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఇతను ఒక హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడు. ఆ హీరోయిన్ కూడా ఉపేంద్రను గాఢంగా ప్రేమించింది. ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకొని తిరిగేవారు. ఇద్దరు వివాహం కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఇంతలో ఏమైందో తెలియదు ఆ హీరోయిన్ ఉపేంద్రను వివాహం చేసుకోనని చెప్పిందట. దీంతో ఉపేంద్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఉపేంద్రను ప్రేమించి మోసం చేసిన హీరోయిన్ మరెవరో కాదు ప్రేమ. ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ప్రేమ ఉపేంద్రను మోసం చేసి వెళ్ళిపోయింది. లవ్ ఫెయిల్యూర్ తో సతమతమవుతున్న సమయంలో తాను నటించిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి.

ఇక అతను సినిమాల పైన పెద్దగా ఆసక్తిని పెట్టలేకపోయాడు. ఇక ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో ఉపేంద్ర జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు హీరోయిన్ ప్రియాంక. తెలుగులో జెడి చక్రవర్తి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూర్య సినిమాలో హీరోయిన్ ప్రియాంక నటించింది. ఉపేంద్ర, ప్రియాంక ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఇక వివాహ అనంతరం ఉపేంద్ర వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

 

 

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading