నటి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి ప్రముఖ భారతీయ సినీ నటి. వందలాది హిందీ, తమిళ, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. శ్రీదేవికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు నుండి కూడా సినిమాల్లో కనపడడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి శ్రీదేవి పెద్ద హీరోయిన్ గా మారింది. 1976లో కె బాలచందర్ ముండ్రు మడిచి లో హీరోయిన్ గా నటించి పెద్ద విజయాన్ని అందుకుంది శ్రీదేవి. దురదృష్టశాత్తు 2018 లో చనిపోయింది శ్రీదేవి. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి.
Advertisement
ఈమె ఏకంగా 300 కి పైగా సినిమాల్లో నటించారు. అయితే శ్రీదేవి గురించి చాలామందికి తెలుసు. కానీ శ్రీదేవి సోదరి గురించి చాలామందికి తెలియదు. శ్రీదేవి సోదరి పేరు శ్రీలత. శ్రీలతకి శ్రీదేవికి మధ్య బాండింగ్ చాలా గట్టిగా ఉండేది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ వాళ్ళిద్దరి మధ్య పలు గొడవలు అవ్వడంతో దూరం అయిపోయారు. శ్రీలత కూడా నటే. ఆమె 1972 నుండి 1993 వరకు ఇండస్ట్రీలో పని చేశారు. శ్రీదేవి అన్ని సినిమాల్లో కూడా ఆమె ఉండేది. శ్రీదేవిలా ఈమె సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఆమె శ్రీదేవి మేనేజర్ గా ఉండేది.
Advertisement
శ్రీదేవి తల్లి మరణం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. శ్రీదేవి తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ లో తప్పు జరగడంతో హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చింది శ్రీదేవి. అప్పుడు ఆ కేసులో శ్రీదేవి గెలవగా 7.2 కోట్ల రూపాయలు ఆమెకి వచ్చాయి వాటిని ఆమె తీసేసుకుందని దీంతో శ్రీదేవికి తన సోదరికి మధ్య గొడవలు జరుగుతాయి అని తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీదేవి మీద శ్రీలత కేసు వేశారు. శ్రీదేవి తల్లి మానసికంగా బాగోకపోవడంతో ప్రాపర్టీని శ్రీదేవి పేరు మీద రాసేసిందని శ్రీలత కంప్లైంట్ చేయగా.. శ్రీలత కేసులో గెలవడంతో రెండు కోట్ల రూపాయలని ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా వీళ్ళ మధ్య పలు విభేదాలు వచ్చాయి.
Also read:
- “పుష్ప 2 ” మార్చిలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆగష్టు 15 నే ఎందుకు విడుదల చేయబోతున్నారో తెలుసా ?
- Akkineni Nagarjuna : తాగుబోతుగా మారిన నాగార్జున.. అమలతో గొడవ ?
- Lavanya Tripathi : పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం !