Home » బాహుబలి మూవీలో అనుష్క క్యారెక్టర్ కి డూప్ గా నటించింది ఎవరో తెలుసా ?

బాహుబలి మూవీలో అనుష్క క్యారెక్టర్ కి డూప్ గా నటించింది ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో అనుష్క ఒకరు. బాహుబలీ సిరీస్ అనుష్క సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కించారు. బాహుబలి తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని దేశమంతటా వ్యాపించే విధంగా చేసింది. ఈ సినిమాతో ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైపు చూస్తుండటం గమనార్హం. ప్రధానంగా సంచలనాలు సృష్టించి రికార్డులను తిరగరాసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోయింది. 

Advertisement

రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన ఈ సినిమాలో తొలిభాగంలో అనుష్క బానిసగా, రెండో భాగంలో యువరాణిగా తన నటనతో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో అనుష్క పాత్రకు కొన్ని సన్నివేశాల్లో డూప్ ని పెట్టిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఎందుకు అంటే ఆమె అంతలా అనుష్క క్యారెక్టర్ లో ఒదిగిపోయి మరీ నటించింది. చూడటానికి అచ్చం అనుష్క మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆమెను డూప్ అని ఎవ్వరూ అంత త్వరగా ఐడెంటిపై చేయలేరేమో అంతలా తన నటనతో పోలికలతో అదురగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. 

Advertisement

ఈమె కూడా ఓ హీరోయిన్. పేరు రుషిక రాజ్. చూడటానికి అనుష్క మాదిరిగానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే వీరిద్దరిలో అనుష్క ఎవరు అని గుర్తు పట్టడం చాలా కష్టం. ఇకపోతే ఆమె అనుష్కకి డూప్ గానే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి అలరించింది. ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అనుష్క విషయానికొస్తే.. బాహుబలి సినిమా తరువాత భారీగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఒకటి రెండు సినిమాలకే పరిమితమైంది. దాదాపు మూడు నాలుగు ఏళ్లకు పైగా మళ్లీ తన సినిమాను ప్రకటించలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా మిస్టర్ వర్సెస్ మిసెస్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ? వాటి కోసమే అంతనా..!

 పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్…ఎప్పుడు ఎక్కడ చేసుకోబోతున్నాడాంటే..?

బాలయ్య డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా..ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading