సాధారణంగా ప్రతీ శుభకార్యం సమయంలో దీపారాధన చేస్తుంటారు. కొంత మంది ప్రతీ రోజు దీపం వెలిగిస్తుంటారు. మరికొందరూ కొన్ని సందర్భాల్లో దీపారాధన చేస్తుంటారు. ఇలా దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది. అసలు దీపారాధన ఏ వైపు చేయాలి ? ఏవైపునకు దీపం పెట్టకూడదు.. దీపం ఏ దిక్కుకు పెట్టడం వల్ల శుభం, ఏ దిక్కుకు పెట్టడం వల్ల అశుభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
అదేవిదంగా ఆరోగ్యం, ధనం, వృద్ధి దీపారాధన చేయడం వల్ల మంచి కలుగుతుంది. ఆరోగ్యం, ధనం, వృద్ధి చెందుతుంది. ఇక శత్రువులు కూడా మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి. ఇన్ని మంచి లాభాలున్న దీపారాధనను ప్రతీ రోజు చేయాలని సనాతన ధర్మం చెబుతోంది. దీపాన్ని తూర్పు వైపునకు పెడితే ఆరోగ్యం కలుగుతుంది. పడమర వైపు దీపం పెట్టడం వల్ల భక్తి పెరుగుతుంది. ఉత్తరానికి పెడితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
Advertisement
దక్షిణానికి దీపం పెట్టడం వల్ల అశుభం, మృత్యు కారకం వంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా భగవంతుడికి దీపం ఏవైపు ఉండాలనే నియమం ఉంటుంది. మహా శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడి వైపునకు దీపాన్ని ఉంచాలి. మధ్యలో అస్సలు దీపాన్ని ఉంచకూడదు. అదేవిధంగా ఒకే వత్తితో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. ఒకసారి వెలిగించిన వత్తిని మళ్లీ వినియోగించకూడదు. బయట దొరికే దీపారాధన నూనెలను అవి వేటితో చేస్తున్నారో పరిశీలించకుండా ఉపయోగించకూడదు. దీపారాధనకి ఆవు నెయ్యి చాలా శ్రేష్టకరమైందని చెప్పవచ్చు.
Also Read : సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి..? కరెక్ట్ ముహుర్తం ఇదే..