Home » నూతన సంవత్సర వేడుకలను ఫస్ట్ ఏ దేశం.. లాస్ట్ ఏ దేశం సెలబ్రేషన్స్ చేసుకుంటుందో తెలుసా ? 

నూతన సంవత్సర వేడుకలను ఫస్ట్ ఏ దేశం.. లాస్ట్ ఏ దేశం సెలబ్రేషన్స్ చేసుకుంటుందో తెలుసా ? 

by Anji
Ad

నూతన సంవత్సరం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేషన్స్  జరుపుకుంటారు. 2022 ఏడాదికి ముగింపు పలికి సరికొత్తగా 2023కి స్వాగతం పలికేందుకు అన్ని దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుగుతాయి.. చివరిగా ఏ దేశంలో నిర్వహిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కొత్త సంవత్సరం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా విభిన్న రీతిలో సంబురాలను జరుపుకోవాలనుకుంటుంది. డిసెంబర్ 31న పలు దేశాల్లో ప్రజలు పటాకులు కాల్చుతూ.. డ్రింక్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టలేవు. కొన్ని దేశాలు మాత్రమే కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. దాదాపు 4వేల సంవత్సరాల కిందట ఇరాక్ లోని బేబీలాన్ ప్రాంతం ప్రపంచ దేశాల కంటే ముందుగా న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పేది. కాలానికి అనుగుణంగా వాతావరణం పరిస్థితుల్లో మార్పులు రావడంతో ప్రస్తుతం ఓసియానియా ప్రాంతం అన్ని దేశాల కంటే ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది. 

Advertisement

 

Manam News

ఓసినియానియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ని కలిపే ప్రాంతం. టోంగా, కిరిబతి, సయోవా వంటి పసిఫిక్ ఐలాండ్ వంటి దేశాలు ఓసియానాలోనివే. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలకే ఓసియానియాలో నూతన సంవత్సరం వేడుకలు ప్రారంభం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరి కంటే ముందు ఓసియానియా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటే.. అందరి కంటే లాస్ట్ కి నూతన సంవత్సరానికి స్వాగతం పలికే దేశం బేకర్, హౌలాండ్ ద్వీపాలు. అమెరికా సమీపంలో ఉంటాయి.భారత కాలమానం ప్రకారం.. జనవరి 01 సాయంత్రం 5.30 గంటలకు ఈ ప్రాంత ప్రజలు కొత్త సంవత్సరం జరుపుకోవడం గమనార్హం. 

Also Read :   కొత్త ఏడాదిలో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

Visitors Are Also Reading