Home » ఇడ్లీ ఫస్ట్ ఎక్కడ పుట్టిందో తెలుసా ? 

ఇడ్లీ ఫస్ట్ ఎక్కడ పుట్టిందో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసి టీ లేదా కాఫీ తాగిన తరువాత అందరూ టిఫిన్ చేస్తుంటారు. టిఫిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా, ఉప్మా ఇలా ఎన్ని ఉన్నప్పటికీ అందులో ఇడ్లీ యొక్క ప్రత్యేకతనే వేరు. ఉదయం వేళలో సాంబర్, చట్నీతో కలిపి ఇడ్లీ తింటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఇవాళ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే ఇలా అన్నింటి మాదిరిగానే ఇడ్లీకి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. మార్చి 30ని ఇడ్లీ రోజుగా పాటిస్తుంటారు.  

Also Read :  ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగవచ్చా? రోజు తాగితే ఏమవుతుంది?

Advertisement

చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ 2015లో దీనిని గుర్తించాడు. మార్చి 30న ఇడ్లీ డే జరుపుకోవడం కోసం ఎనియవన్ సుమారు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేసి ఇడ్లీ యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 44 కిలోల ఇడ్లీని కట్ చేసి సంబురాలు జరిపాడు. చాలా మంది ఇడ్లీ పుట్టింది భారత్ లో అనుకుంటారు. కానీ ఇడ్లీ భారతదేశంలో పుట్టలేదని చరిత్రకారుడు చెబుతున్నారు. ఇడ్లీ అనగానే దక్షిణ భారతదేశ వంటకం అని భావిస్తుంటారు. కానీ కేటీ ఆచార్య అనే ఫుడ్ హిస్టారియన్ మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలోను పుట్టిందని పేర్కొంటున్నాడు. ఇడ్లీలను రకరకాలుగా తయారు చేస్తుంటారు. మనం కొన్ని రకాల గురించి తెలుసుకుందాం.  

Advertisement

Also Read :   విటమిన్ల లోపాన్ని తెలిపే సంకేతాలు ఇవే..!

ఇడ్లీ పిండితో.. 

Manam News

 

ఒక కప్పు మినపపప్పు, 5 కప్పుల ఇడ్లీ రవ్వ 5 గంటల సేపు నానబెట్టుకొని మనం ఇడ్లీలను తయారు చేసుకుంటాం. చాలా మంది ఈ రకం ఇడ్లీని ఎక్కువగా ఇలా తయారు చేస్తుంటారు. 

గ్రీన్ లీఫ్ ఇడ్లీ :

Manam News

తొలుత నాలుగు స్పూన్లు కరివేపాకు పొడి, రెండు స్పూన్ల కారం ఓ పాత్రలో వేసుకోవాలి. ఆ తరువాత నచ్చిన ఆకుకూరలు సన్నగా తరిగి లేదా గ్రైండ్ చేసుకొని అందులో వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పిండిలో కలిపి ఆ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో పోయాలి. కుక్కర్ ని ఓ మోస్తార్ మంట మీద ఉంచితే సరిపోతుంది. 

ఓట్స్ ఇడ్లీ :

Manam News

ఓట్స్ మనిషి యొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇడ్లీనే ఆరోగ్యం అంటే.. ఓట్స్ ఇడ్లీ అంటే చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఓట్స్ ఇడ్లీలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని జీవన శైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. 

Also Read :  40 ఏళ్లు దాటిన మహిళలు భర్త దగ్గర ఇదే కోరుకుంటారట..!!

Visitors Are Also Reading