Home » హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

తమిళ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గజినీ సినిమా అప్పటి నుంచి సూర్యకి అభిమానులు అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇక అప్పటి నుంచి సూర్య తమిళంలో తీసిన ప్రతీ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదలవుతాయి. దీంతో సూర్య ప్రతీ సినిమాకి ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాడు. ఇటీవల సూర్య పుట్టిన రోజుకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ర్యాలీలు, సెలబ్రేషన్స్ చేశారు. సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. 

Advertisement

ప్రస్తుతం సూర్య కంగువా మూవీ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మరో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇటీవలే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెండు సినిమాలున్నాయని చెప్పి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తన రాబోయే సినిమాలపై మరింత ఆసక్తి పెంచారు. ఇటీవలే సూర్య దంపతులు ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గత కొంత కాలం నుంచి సూర్య చెన్నైలో ఉండటం లేదని.. ముంబైలో ఉంటున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ విషయం పై సూర్యని అభిమానులు ప్రశ్నించగా .. తాను చెన్నైలోనే ఉంటాను.

Advertisement

కానీ మా పిల్లలిద్దరూ ముంబైలో చదువుతున్నారు. వారిద్దరూ మాత్రమే అక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడు వాళ్ల కోసం ముంబై వెళ్లి వస్తున్నాను..అంతేకానీ తాను చెన్నైని వదిలి ఎక్కడికి వెళ్లలేదు అని చెప్పారు సూర్య. జ్యోతిక, సూర్య దంపతులకు ఇద్దరు పిల్లలని తెలిసిందే. కూతురు దియా, కుమారుడు దేవ్.  దియా రెండేళ్ల కిందటే పదోతరగతి పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడూ వారిద్దరూ ముంబైలో చదువుతున్నారని.. స్వయంగా సూర్యనే వెల్లడించారు. కానీ వారు ఏయే కోర్సులు చదువుతున్నారో మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా సూర్య పిల్లలు మాత్రం ముంబైలో హయ్యర్ స్టడీస్ చదువుతున్నారని వెల్లడించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

మీరు ఇప్పటివరకు చూడని హీరో సురేష్ కొడుకు ఎవరో తెలుసా !

 హీరోయిన్ సమంత అంటేనే నాకు క్రష్ – విజయ్ దేవరకొండ సంచలనం

Visitors Are Also Reading