Home » బాలకృష్ణ గురించి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏమన్నారో తెలుసా ?

బాలకృష్ణ గురించి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లైగర్ మూవీ తరువాత విజయ్ నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనా వ్యక్తం చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ముగ్గురికి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. 

Advertisement

ఈ చిత్రం హిట్ అయితే కనుక వీరి ముగ్గురి కెరీర్ గాడిలో పడ్డట్టే అంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 01న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఖుషి మూవీ మేకర్స్.  ప్రస్తుతం తమిళనాడులో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే  ఇది వరకే రజినీకాంత్, చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు బాలయ్య గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. తాాజాగా బాలయ్య గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆయన అంటే తనకు చాలా ప్రేమను పంచుతాడు.

Advertisement

బాలకృష్ణ తన జీవితాన్ని చిన్నపిల్లాడిలా గడుపుతాడు అని వెల్లడించారు. తాను తొలి ఆయనను కలిసినప్పుడు చాలా సమయం పట్టింది. ఇలా చిన్న పిల్లాడిలా ఎలా ఉండగలుగుతున్నాడని చెప్పుకొచ్చారు. ప్రేమిస్తే ఆయన ప్రాణం ఇస్తారు. నన్ను ప్రేమిస్తారు కాబట్టి ఆయనలో రెండో వైపు నేను చూడలేదని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా కోసం అందరిలాగే తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. విజయ్ గతంలో నటించిన లైగర్ మూవీ ఫ్లాప్ కావడంతో.. ఈ సినిమా ఫలితం పైనే కాస్త టెన్షన్ గా ఉన్నారట విజయ్ అభిమానులు. ఈ సినిమా ఫలితం పై ఏమాత్రం తేడా వచ్చినా విజయ్ పై నెటిజన్లు మరోసారి భారీగా విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది తెలియాలంటే సెప్టెంబర్ 01 వరకు వేచి ఉండాల్సిందే మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

 ఎటువంటి అబ్బాయి కావాలి అనే ప్రశ్నకు.. ఆదాశర్మ సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..!

Visitors Are Also Reading