తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో కొన్ని ప్రత్యేక అధ్యాయాలు ఈయన పేరిట ఉంటాయని చెప్పవచ్చు. ఆయన ఇండస్ట్రీలో ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా డెవలప్ చేశారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో చేయని పాత్రలు అంటూ లేవు. సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన ఘనుడు..ఇంతకీ ఆయన ఎవరో గుర్తుకొచ్చిందా.. ఆయనే నందమూరి తారక రామారావు.. ఈయన పేరు చెబితే తెలుగు వారి గుండెలు పులకరించి పోతాయి. తన నటన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అంతే కదా తన రాజకీయ చతురతతో ఎన్నో స్కీములు తీసుకొచ్చి పేదల దేవుడిగా మారారు.
also read;
Advertisement
అలాంటి ఎన్టీఆర్ సినీ కెరియర్లో 1977 చాలా స్పెషల్ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జానపద, పౌరాణిక, హిస్టారికల్ పాత్రల్లో మెప్పించగల హీరో మహానటుడు ఎన్టీఆర్. ఆయన రాజకీయాల్లో కూడా చేరి తెలుగు రాష్ట్రాన్ని పాలించాడు. ఇలాంటి రాజకీయాలు ఒక వైపు సినిమాలు చేస్తూ తెలుగు అభిమానుల ఆరాధ్య దైవంగా మారాడు.
Advertisement
also read:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… ఉద్యోగాల రాత పరీక్ష తేదీలపై TSPSC కీలక ప్రకటన
అలాంటి పౌరాణిక సినిమాలతో దూసుకెళ్లిన ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో కృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్ళు రావడంతో కాస్త జోరు తగ్గింది. 1977 ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. జనవరి 18న రిలీజ్ అయిన దానవీరశూరకర్ణ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులో ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయం మర్చిపోకముందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఈ ఏడాది చివరలో యమగోల రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా 1977లో మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్రకు తిరగరాశారు ఎన్టీఆర్. ఆయన సినీ కెరియర్ లో ఇది ఒక రికార్డు అని చెప్పవచ్చు.
also read: