Home » బేబీ మూవీ కాంట్రావర్సీ పై విశ్వక్ సేన్ ఏమన్నారో తెలుసా ?

బేబీ మూవీ కాంట్రావర్సీ పై విశ్వక్ సేన్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఊపు ఊపుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది బేబి మూవీ అనే చెప్పాలి. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద హిట్ అయిన బేబి మూవీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బేబి మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో కలెక్షన్లను ఎలా వసూలు చేస్తుందో.. అదేవిధంగా పలు కాంట్రవర్సిలకు కూడా దారి తీసింది. ఈ కాంట్రావర్సి బేబి మూవీ దర్శకుడు సాయి రాజేష్, యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ వాస్తవానికి దర్శకుడు సాయిరాజేష్.. విశ్వక్ సేన్ కి చెబుదామని అనుకున్నాడట.

Advertisement

రెండు, మూడు సార్లు విశ్వక్ సేన్ ని కలిసి స్టోరీ చెప్పడానికి కూడా ప్రయత్నించగా.. విశ్వక్ సేన్ స్టోరీ కూడా వినకుండా ఛీ వాడితో మూవీ అంటే అస్సలు చేయను అని సన్నిహితులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి రాజేష్ విశ్వక్ సేన్ కి స్టోరీ చెప్పే ప్రయత్నం మానుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవలే సాయి రాజేష్ బేబి సక్సెస్ మీట్ స్టేజ్ పై విశ్వక్ సేన్ పేరు చెప్పకుండా ఓ హీరో నన్ను రిజెక్ట్ చేశాడంటూ క్యాజువల్ గా చెప్పాడు. దీంతో అందరూ బేబి మూవీ రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవ్వరంటూ.. ఆరా తీయకవిశ్వక్ సేన్ పేరు బయటికీ వచ్చింది. దానికి తోడు విశ్వక్ సేన్ కూడా తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో బేబి మూవీ దర్శకుడు సాయి రాజేష్  ని టార్గెట్ చేసే విధంగా పలు ట్వీట్స్ చేశాడు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన అయినట్టయింది. దర్శకుడు సాయి రాజేష్ కూడా విశ్వక్ సేన్ ట్వీట్స్ కి బదులు కూడా ఇచ్చాడు.

Advertisement

లేటెస్ట్ గా ఈ వివాదం గురించి విశ్వక్ సేన్ ఓపెన్ అయ్యాడు. ఇటీవలే పేకమేడలు అనే చిన్న సినిమా టీజర్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన విశ్వక్ సేన్ బేబి సినిమా కాంట్రవర్సీ పై స్పందిస్తూ.. నాకు ఉన్న కొన్ని సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని.. కథ విని నో చెప్పడం కన్నా వినకుండానే నో చెబితే దర్శకుడు వెస్ట్ అవ్వకుండా కూడా ఉంటుందనే ఉద్దేశంతో బేబి మూవీని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బేబి మూవీ గురించి దర్శకుడు సాయి రాజేష్ గురించి నెగిటివ్ గా రెస్పాండ్ అయిన విశ్వక్ సేన్ స్టేజ్ పై మాత్రం వినమ్రంగా మాట్లాడటం గమనార్హం. మరీ ఈ కాంట్రావర్సీ ఎంత దూరం వెళ్తుందో.. దీనిపై బేబి మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ హిట్ దర్శకులతో జత కట్టేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నాడా..?

 లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఏమైందంటే..?

 

Visitors Are Also Reading