టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్‌లో ఎన్టీఆర్ పేరు తొలుత వినిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా.. సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్‌లో మాత్రం ఎటువంటి మార్పుండదు. ఎంతటి కష్టం అయినా స్టెప్ అయినా అవలీలగా వేసేస్తుంటాడు. ఎన్టీఆర్‌తో డ్యాన్స్ అంటే హీరోయిన్‌లతో పాటు కొరియో గ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. ఎంతటి బెస్ట్ డాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తు పెట్టుకుని చేయాలంటే ముందే రిహార్సల్స్‌లో తప్పకుండా పాల్గొంటారు.
Advertisement
Advertisement
ఇక ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు రిహార్సల్స్‌యే చేయలేదట. ఏ ఒక్క సాంగ్‌కు రిహార్సల్స్ చేయకుండానే సెట్‌లోకి వచ్చేవాడట. ఈ విషయాన్ని కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చెప్పాడు. మన స్టార్ హీరోలలో తక్కువగా రిహార్సల్స్ చేసేది ఎవరు అని యాంకర్ అడగగా.. ఎన్టీఆర్ అని.. ఆయన ఇప్పటివరకు రిహార్సల్స్ కు రాలేదండి. డైరెక్ట్ గానే చేసేస్తారని చెప్పుకొచ్చారు. ఈ మాటతోనే ఎన్టీఆర్ ఎంత మంచి డ్యాన్సరో అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తొలి నుంచి ఎన్టీఆర్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని.. తారక్ తల్లి షాలినికి ఎన్టీఆర్ గొప్ప నృత్య కళాకారుడు కావాలని కోరిక ఉండేదట. అందుకే చిన్నప్పటి నుంచే తారక్‌కు కూచిపూడితో సహా అన్ని రకాల డాన్స్‌లను నేర్పించింది. ఎన్టీఆర్ ఇటీవలే ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Also Read :