నయనతార విఘ్నేష్ పెళ్లికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మంత్రి ఆర్.కే.రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీ మంత్రి రోజా సెల్వమణి నయన్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.నయనతార-విఘ్నేష్ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ట్వీట్ చేశారు. ఏడేళ్ల కాలం ప్రేమించుకున్న జంట ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటి అయింది.
Advertisement
నయనతార సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ లేడీ సూపర్ స్టార్‌గా కీర్తి పొందింది. వీరి పెళ్లికి ప్రముఖ సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు తమిళస్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్, వంటి ప్రముఖులు హాజరయ్యారు. మహాబలిపురంలోని ఒక రీసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఒక్కటయ్యారు. ఉదయం నుండి వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన విఘ్నేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Advertisement
నయన్, నేను ఒక్కటయ్యాం. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగిందని విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటో షేర్ చేసాడు. పెళ్లిలో నయనతార సెంట్రాప్ అట్రాక్షన్ గా మారారు. అందరూ ఆమె వేసుకున్న నగల గురించే చర్చించుకుంటున్నారు. నయనతార నగలు రూ.2.5 కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు ఉంటాయి. విఘ్నేష్ నయనతారకు రూ.5కోట్ల విలువైన డైమండ్ రింగ్ అందించాడు. తాజాగా కొత్త జంటకు సెటబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఏపీ పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కే.రోజా ఇప్పుడు నయనతారకు విషేష్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. రోజా కూడా తమిళియన్‌ను పెళ్లి చేసుకున్న విషయం విధితమే.
Also Read :
హర్ష సాయికి అసలు అన్ని డబ్బులు ఎక్కడివి..? ఇతను ఏం చేస్తాడు..?
కరాచీ బేకరీకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..?