మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభించిన సమయంలోనే అతనిలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్ హీరోగా ఎదుగుతాడని ముందుగానే గ్రహించారు ఫేమస్ కమెడీయన్ అల్లు రామలింగయ్య. ఇక ఆ నమ్మకంతోనే తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ చూస్తుండగానే మెగాస్టార్ గా ఎదిగారు.
Advertisement
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నుంచి చౌదరీలు ఎక్కువగా ఉండేవారు. అప్పడు, ఇప్పుడు టెక్నీషియన్లు కానీ, దర్శకులు కానీ చాలా మంది కమ్మవాళ్లు ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే సమయంలో చిరంజీవి హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. ఇక అప్పటికే నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమాలతో అప్పటికే అభిమానులను సంపాదించుకున్నాడు. మెల్లగా చిరంజీవికి పాపులారిటీ రావడం ప్రారంభమైంది. పెద్దవాళ్లతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టమని భావించాడు అల్లు రామలింగయ్య. ఎన్టీఆర్ తన కొడుకుని పైకి తీసుకురావడం కోసం చిరుని తొక్కేస్తాడేమో అని, అప్పటికీ తమ కులం వాళ్లు ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి చిరంజీవిని చాలా జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించి పైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అల్లు రామలింగయ్య.
Advertisement
ఇక అప్పటి నుంచి అల్లు రామలింగయ్య ఓ రోజు చిరంజీవిని పిలిచి ప్రతి రోజు ఉదయం 4 గంటల సమయానికి ఎన్టీఆర్ గేటు నుంచి 9999 అంబాసిడర్ బయటికి వస్తుంది. ఆయన అందులో ఉంటారు. ఆయన బయటికి రాగానే ఆయనకు ఓ నమస్కారం చేయాలని సూచించారట. దీంతో ఎన్టీఆర్ మనవాడే పైకి వస్తాడు అనే ఫీలింగ్ కలుగుతుందనేది అల్లు రామలింగయ్య ఆలోచన. అలా చాలా కాలం పాటు పెద్దాయనకి చిరు గుడ్ మార్నింగ్ చెప్పేవారట. అదేవిదంగా ఓ సారి వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ప్రాంతాలను సందర్శిచడానికి వెళ్లినప్పుడు జగదేక వీరుడు అతిలోకసుందరి టీమ్ ఎన్టీఆర్ కి ఎదురైంది. ఆ సమయంలో చిరంజీవిని కలిసి బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని అనుకుంటున్నారు అని ఎన్టీఆర్ పలకరించారట. చిరంజీవి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అలా పైకి వచ్చారట.
Also Read : MUKHACHITRAM MOVIE REVIEW : ముఖచిత్రం సినిమా రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?