సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేము. సాధారణంగా ఎంత అద్భుత నటన కనబరిచినప్పటికీ ఆవగింజంత అదృష్టం లేకపోతే కొనసాగడం కష్టం అనే చెప్పాలి. కొంతమంది నటులను చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. అంతేకాదు.. కొంతమంది సినీ ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఓవర్ నైట్ లోనే స్టార్డమ్ తెచ్చుకుంటారు. ఆ తరువాత వాళ్లు తప్పులు చేస్తారో లేదంటే.. స్టార్ డమ్ వచ్చిందనే అహంతో ఉంటారో తెలియదు. కానీ మళ్లీ కొంత కాలంలోనే కనుమరుగైపోతారు. కొంతమంది అయితే ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా ఇండస్ట్రీకి కొనసాగుతూనే ఉంటారు.
Advertisement
ఇలా మూడు రకాలుగా ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి ఉంటుంది. ఇదేవిధంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే కనుమరుగై పోవడమే కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అలాంటి ఉదయ్ కిరణ్ ఆ**త్య చేసుకొని తన భార్యకు తోడు లేకుండా ఈ లోకాన్ని విడిచిపోయాడు. మరీ తన భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తుంది.. అనే విషయాలను చూద్దాం. సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ ఆ తరువాత కథల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల వరుస ఫ్లాప్ లు వచ్చాయి. దీంతో ఇబ్బందులు భరించలేక తన రూమ్ లోనే ఉరే*కున్నాడు. పెళ్లి జరిగిన తరువాత ఉదయ్ కిరణ్ ఇలా చేసుకోవడంతో ఇప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ మరణం ఒక మిస్టరీగానే మిగిలింది.
Advertisement
ఆమె అప్పుడు సాప్ట్ వేర్ జాబ్ చేసేది. తనకు వచ్చిన డబ్బులతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ నుంచి కోలుకోవాలని చాలా డాక్టర్ల దగ్గరికీ తీసుకెళ్లింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతటి స్టార్డమ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా చాలా మంది అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కట్ చేస్తే.. ఉదయ్ కిరణ్ మరణం తరువాత తన భార్య విషిత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ.. దాని ద్వారా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు ఇస్తూ గడుపుతోంది. ఉదయ్ కిరణ్ ని మరిచిపోలేక పెళ్లి కూడా చేసుకోవడం లేదట విషిత. ఉదయ్ కిరణ్ కనుక ఉండి ఉంటే.. వారి లైఫ్ మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆర్.నారాయణ మూర్తి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
NTR: రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ కు గొడవేంటి..? మొదటి రోజే అలా జరిగేసరికి?