పూర్వకాలంలో అయితే పెళ్లి విషయంలో చాలావరకు పెద్దల నిర్ణయమే ఉండేది. వారు నిర్ణయించిన సంబంధాన్నే చేసుకునేవారు. కానీ ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆడదంటే వంటింటికే పరిమితం కాదు ఆకాశంలో విమానాన్ని కూడా నడపగలదు అనే పరిస్థితికి వచ్చారు.
Advertisement
ఈ తరుణంలో మగవారితో సమానంగా ఏ విషయంలోనైనా పోరాడుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ కల్చర్ లో అమ్మాయిలు కూడా చాలా అవగాహనతో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఇబ్బందులు పడకుండా పెళ్లికి ముందే అనేక ఒప్పందాలు చేసుకొని దానికి అనుగుణంగా పెళ్లి చేసుకోవడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం.
also read:చలికాలంలో పిల్లల సంరక్షణకు అద్భుతమైన చిట్కాలు ఇవే..!
Advertisement
అయితే మహేష్ బాబు నమ్రత వివాహంలో కూడా అలాంటి ఒప్పందాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలని నమ్రతకు మహేష్ బాబు కండిషన్ పెట్టారట. ఆ విధంగానే ఆమె వివాహం తర్వాత ఒక గృహిణి లా మారిపోయింది. ఈ తరుణంలో మహేష్ కు కూడా నమ్రత ఒక కండిషన్ పెట్టిందట. అదేంటయ్యా అంటే.. మనం వివాహం తర్వాత బంగ్లాలో కాపురం చేయడం నావల్ల కాదు, నాకు కాస్త పరిస్థితులు అలవాటు పడే వరకు మనము ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉందామని చెప్పిందట.
దీనికి మహేష్ బాబు కూడా ఒప్పుకున్నాడట. ఈ విధంగా ఒకరికొకరు కండిషన్లు పెట్టుకొని ఆ మాటపై నిలబడుతూ వారి సంసార జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. 2005లో మహేష్ నమ్రతల వివాహం గోప్యంగా సన్నిహితుల మధ్య జరిగింది. వీరికి 2006లో గౌతమ్ పుట్టారు. అయితే గౌతమ్ నెలలు నిండక ముందే జన్మించారట. ఆ సమయంలో నమ్రత తల్లిదండ్రులు చాలా బాధపడ్డారట. కానీ డాక్టర్ల వల్ల ఒకటిన్నర కేజీ పుట్టిన గౌతమ్ బ్రతికి బట్ట కట్టారు.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో నమ్రత చెప్పుకొచ్చింది.
also read: