సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని నటీనటులను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తుల వరకు ప్రతీ ఒక్కటీ కూడా తమ హీరోల అంటూ అభిమానులు ఉపయోగించుకుంటుంటారు. ముఖ్యంగా నటీనటులు సైతం తినే ఆహారంలో కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పవచ్చు. నటీనటులు సైతం బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అప్పట్లో అయితే అలాంటివి ఏమి లేవు. సీనియర్ నటుడు కృష్ణ మాత్రం ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికే ప్రియారిటీ ఇచ్చేవారు. ఆయన ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలను తెరకెక్కించిన కొంతమంది రచయితలు, కో ఆర్టిస్టులు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా గూఢచారి 117 సినిమాకి పని చేసిన రచయిత తోటపల్లి మధు.. కృష్ణకి సంబంధించిన ఆహారపు అలవాట్ల విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ.. కృష్ణ గారు ఎప్పుడూ ప్రతి ఒక్కరితో చాలా సింపుల్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూాడా చాలా గమ్మత్తుగా అనిపిస్తాయని వివరించారు.
Advertisement
Also Read : చిరు, బాలయ్య, నాగార్జునలతో కలిసి నటించిన కృష్ణ.. కానీ వెంకటేష్ తో ఎందుకు చేయలేదు ?
ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కచ్చితంగా టిఫిన్ పూర్తి చేసుకుని వస్తారని.. మళ్లీ 11 గంటలకు కేవలం పెరుగు, వడ మాత్రమే తినేవారు. మధ్యాహ్నం భోజనం సమయంలో 1 గంటలకు భోజనం చేసేవారు. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్ది సేపు నిద్రపోయి మళ్లీ లేచే వారని వెల్లడించారు. అలా కొద్ది సేపు గడిచిన తరువాత సున్ని ఉండలు తినేవారని, సాయంత్రం 5 గంటలు గోధుమ రవ్వతో వేసిన దోసెను మీ హోటల్ నుంచి తెప్పించేవారని చెప్పుకొచ్చారు. ఇది మద్రాస్ స్టైల్ అని, సూపర్ స్టార్ కృష్ణ ఆహారానికి చాలా ప్రాధాన్యత ఉండేదని తెలిపారు. దాదాపు ఈ మెనునే ప్రతీ సినిమా షూటింగ్ లో కృష్ణ కచ్చితంగా పాటించేవారట.
Also Read : ఆ నాలుగు కోరికలు తీరకుండానే కృష్ణ లోకాన్ని విడిచారా..? ఆ కోరికలు ఏవంటే..?