బాలయ్య హోస్టుగా ఆహా లో చేసిన అన్ స్టాపబుల్ షో భారీగా హిట్ అయ్యింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు సరికొత్త గా కనపడటంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ షోకి సీజన్ 2 ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ లో అందరినీ ఆశ్చర్య పరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహా లో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు.
Also Read : ‘కాంతార’ మూవీ హీరోకు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా ?..
Advertisement
ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు, నారా లోకేష్ సందడి చేశారు. చంద్రబాబు కి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదాగా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. షోలో ఎన్టీఆర్ ని ఎప్పుడు మొదటిసారి కలిశారు అని బాలకృష్ణ అడిగారు.ఈ సందర్భంగా చంద్రబాబును బాలయ్య మీ జీవితంలో బిగ్ అలయన్స్ ఏంటి అని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో బాలయ్య షాక్ అయ్యారు. చంద్రబాబు.. తన జీవితంలో బెస్ట్ అలయన్స్ నా మ్యారేజ్ నా జీవితంలో బిగ్గెస్ట్ అలయన్స్ అదే అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. భువనేశ్వరితో తన పెళ్లి పెద్ద అలయన్స్ అన్నారు. చంద్రబాబు భువనేశ్వరిని 1981 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు.
Advertisement
Also Read : కుర్రహీరోలకు చెమటలు పట్టించిన హరికృష్ణ సినిమా ఏదో తెలుసా..? ఆ సినిమా రికార్డులు ఇవే..?
చంద్రబాబు. ఎన్టీఆర్ కుమార్తె, బాలయ్య సోదరి అయిన భువనేశ్వరి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షో వేదికగా చంద్రబాబు తన పెళ్ళికి సంబంధించిన విషయాన్ని కూడా వెల్లడించారు. పెళ్లయ్యాక హైదరాబాదులో వెంగళరావు పార్కు దగ్గర కాపురం పెట్టానన్నారు అక్కడ నాకు ఇబ్బందిగా ఉందనుకొని జూబ్లీహిల్స్ లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉన్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టి ఇస్తానని తిన్నావా రామారావు తనకు చెప్పారన్నారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ కు వద్దని చెప్పాను అన్నారు. అంతేకాదు ఓ టాస్క్ లో నారా భువనేశ్వరి కి కాల్ చేశారు చంద్రబాబు. భువనేశ్వరిని తాను భువ అని పిలుస్తాను అన్నారు. ఆమెకు షోలో ఉండగానే.. కాల్ చేసి ఐ లవ్ యు చెప్పారు. అయితే బాలయ్య చంద్రబాబుకు ఐ లవ్ యూ అని చెప్పాలన్నారు. ఐ లైక్ యు లోనే లవ్ కూడా ఉంటుందన్నారు. ఇష్టం తర్వాత ప్రేమ ఉంటుందన్నారు చంద్రబాబు. దీంతో బాలయ్య మరేం అనలేకపోయారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : రవితేజ వెంకీ సినిమాతో పోటీపడి బోల్తాకొట్టిన సినిమాలు ఇవే..? లిస్ట్ లో ఆ స్టార్ హీరో సినిమా కూడా..?