సాధారణంగా కొంత మంది స్త్రీలు సంపాదిస్తుంటారు, మరికొంత మంది పురుషులు సంపాదిస్తుంటారు. వీరిద్దరూ సంపాదిస్తేనే వారి కుటుంబం బాగుంటుంది. కానీ ఎవరి సంపాదన ఇంటికి ఖర్చు చేయాలి. ఎవరి సంపాదన ఇంటికి ఖర్చు చేయకూడదు. అదేవిధంగా స్త్రీ సంపాదన భర్త కానీ తండ్రి కానీ లేదా స్త్రీ సంపాదన పురుషుడు వాడుకోవచ్చా..? వాడుకుంటే ఏ యే సందర్బాల్లో వాడుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పెళ్లి జరిగిన తరువాత భార్య యొక్క సంపాదన భర్త ఒక సంవత్సరం వరకు తప్పనిసరి అవసరమైతే వాడుకోవచ్చు. ఎందుకంటే తాను నిలబడాలి. ఆమెకు ఉంది. ఇతనికి లేదు అనుకుంటే.. డబ్బులు తీసుకొని వ్యాపారం లేదా ఏదైనా అవసరాలకు వాడుకొని తిరిగి తనది తనకు ఇచ్చేసేయి. అవసరాలకు, వ్యాపారానికి, నిలబడటానికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి జీవితానికి ఉపయోగపడేది ఏదైనా ఆమె దగ్గర ఉంటే.. పుట్టింటిది అయినా.. లేదా తాను సంపాదించినది ఏదైనప్పటికీ తన పూర్తి ఇష్టంతోటి మరో రెండు సంవత్సరాలు అనగా మొత్తం మూడు సంవత్సరాలు ఏ రూపంలో అయినా భార్య యొక్క సొమ్మును తీసుకోవచ్చు.
Also Read : 100 ఏళ్లనాటి ప్రేమలేఖ వైరల్..అందులో ఏముందంటే.?
Advertisement
బతకడానికి స్త్రీ సంపాదన ఇంటికి కావాలనే కాన్సెప్ట్ తప్పు. ఒక ఇంటిని సంపాదన పరంగా నడిచేది భర్తనే ఉండాలి. ఆర్థికమైన ఆవలంభన కేవలం పురుషుడి నుంచే రావాలి. భార్య భర్తలు ఇద్దరూ సంపాదించుకోండి. కానీ భార్య సంపాదించిన మనీ ఇంటికి కాంట్రిబ్యూట్ అవ్వకూడదు. సేవింగ్ చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా నగలు, భూములు వంటివి కొనుగోలు చేసుకోవాలి. ముఖ్యంగా అన్నింటికంటే ముందు ఇంటికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి. ఇంటి ప్రియారిటీ వంద శాతం అయిపోయిన తరువాతనే మిగతా వాటిని ప్రాధాన్యత ఇవ్వాలి. స్త్రీకి ధనం పుట్టింటి వారు ఇచ్చారంటే ఆమె ఆర్థిక స్వాలంభనకు ఎంత ప్రియారిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి గారింటి నుంచి అత్తగారింటికి వచ్చింది. కానీ ఆమె దగ్గర ఏమి లేవు. అయితే ఆమెకు ఎక్కడ చులకన చేస్తాడో అనే భయం మాత్రం ఉంటుంది. స్త్రీ సంపాదనతో ఇల్లు గడపడం అనేది ఏ కుటుంబానికి మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవడం ఉత్తమం.