సాధారణంగా హిందువులు చాలా సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని పనులు చేస్తే కీడు జరుగుతుందని, మరికొన్ని పనులు చేస్తే మేలు జరుగుతుందని పూర్వ కాలం నుంచి హిందువులు పాటిస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులపై కూడా కొన్ని సెంటిమెంట్లున్నాయి. వాటిని అప్పుగా ఇవ్వడం చేతికి అందించడం వంటివి చేయరు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా కూరల్లో ఉప్పు, పసుపు చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో ఉప్పు పసుపు రెండు ముఖ్యమైనవే అని చెప్పాల్సిందే. అన్ని వేసి చూడు నన్ను చూడు అని ఉప్పు అంటే.. కూరలో ఎన్నివేసినా కానీ నన్ను వేయకుంటే నీకు నా రంగు తెలియదంటుంది. ఈ రెండింటో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పూర్వ కాలం నుంచే ఉప్పు, పసుపును ఎప్పుడూ కూడా ఎవ్వరి చేతికి అందించకూడదని, దానం చేయకూడదని అంటుంటారు. మీకు వారు ఎంత సన్నిహితులు అయినా.. బందువులు అయినా వాటిని మాత్రం దానం చేయకూడదు. ఇచ్చిన వారితో పాటు తీసుకున్న వారి ఇంట్లో నష్టాలు పెరుగుతాయి. ప్రధానంగా ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
సూర్యుడు హస్తమించిన తరువాత అనగా సాయంత్రం తరువాత ఇరుగు పొరుగు వారికి ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోతారు. వంట గదిలో ఉప్పు అయిపోయినా మీరు ఇబ్బందులు పడుతారంట. కిచెన్ లో ఎప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ ఎవరికైనా తప్పని పరిస్థితిలో ఉప్పు ఇవ్వాలనుకుంటే మాత్రం వారి వద్ద కొంత డబ్బు తీసుకొని ఇవ్వాలట. హిందువులు పుసుపును చాలా పవిత్రంగా భావిస్తుంటారు. ప్రతీ శుభకార్యంలో కూడా పుసుపు వాడుతారు. పుసుపును అప్పుగా ఇస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు, వారి వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయట.
అదేవిధంగా వాస్తు శాస్త్రంలో ఉల్లిపాయ, వెల్లుల్లికి కూడా సంబందం ఉంది. అందుకే సూర్యాస్తమయం తరువాత ఉల్లిపాయలు, వెల్లుల్లికి సంబంధించిన వ్యాపారం చేయకూడదని చెబుతుంటారు నిపుణులు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం పోతుందని సూచిస్తున్నారు. అదేవిదంగా ఎంతో పవిత్రంగా భావించే ఆవు పాలను కూడా సాయంత్రం వేళలో ఎవ్వరికీ కూడా దానం చేయకూడదట. ఒకవేళ పాలను సాయంత్రం పూట దానం చేసినా, అప్పుడు ఇచ్చినా వారి ఇంట్లో అరిష్టం కలుగుతుంది. అందుకే ఈ వస్తువులను ఎవ్వరికీ అప్పు ఇవ్వకపోవడం బెటర్. ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం మంచిది.
Also Read :
శ్రావణమాసంలో పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకండి..!