ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. రకరకాల వ్యాధుల భారిన పడుతున్నారు. ఈ వేసవి కాలంలో ఎండలు బాగా మండిపోయే అవకాశముండటంతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇప్పుడే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గోరువెచ్చని నీటితో ఎంతో ప్రయోజనం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వేసవిలో గోరువెచ్చని నీరు తాగడంతో ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నీరు తాగాలని వైద్య నిపుణులు సిఫారసు చేస్తుంటారు. వేసవిని పరిగణలోకి తీసుకుంటే..గోరువెచ్చని నీటితో దాహం తీర్చడం అసాధ్యమనిపిస్తుంది. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. ఇంకా గోరు వెచ్చని నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
గోరువెచ్చని నీరు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. రక్తనాలాలకు విస్తరిస్తుంది. రక్తప్రసరణ మెరుగు పరిచేవిధంగా చేస్తుంది. కండరాలు నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. సాధారణంగా కండరాలు, కండరాల నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. 2003లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. భోజనానికి ముందు 500 మి.లీ. నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ 30 శాతం మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు. గోరువెచ్చని నీటి వల్ల సాధారణ ఫ్లూ, జలుబుతో పోరాడుతుంది. సైనస్ సమస్యతో బాధపడేవారికి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
Advertisement
Also Read : ప్రతి రోజూ పరగడుపున ఇవి తీసుకుంటే జీవితంలో ఏ రోగం దరిచేరదు..!
ఆయుర్వేదం ప్రకారం.. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. జీర్ణక్రియను మెరుగు పరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. ఏడాది పొడవు ఈ నీరు తాగే అలవాటు ఉన్న వారికి చాలా సులభంగా అనిపిస్తుంది. ప్రతీ రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీవక్రియ బలపడుతుంది. అంతేకాదు.. శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది. రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్.. కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ముఖ్యంగా శరీరంలోని అన్ని భాగాలకు రక్తం చాలా అవసరం. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగితే ఫిట్ గా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : గోధుమ గడ్డి జ్యూస్ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!