Home » భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

by Anji
Ad

ఈ మధ్య కాలం చాలా మంది వారి రోజూ డైట్ లో గ్రీన్ టీనీ ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ A, C, E, B కాంప్లెక్స్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒత్తిడి, శరీరంలో అధిక కొలెస్ట్రాల్, బరువు, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే గ్రీన్ టీ భోజనం తర్వాత తాగితే కూడా ఆరోగ్యానికి చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొంత మంది రాత్రి సమయాల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారికి భోజనం తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం సరైన ఎంపిక. ఇది నాణ్యమైన మంచి నిద్రను అందిస్తుంది. గ్రీన్ టీలోని థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి. అలాగే మెదడును కూడా ప్రశాంతంగా చేస్తుంది. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి కాదు.

Advertisement

 

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ నోట్లో క్రిములను దూరం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకున్న తర్వాత నోట్లో బ్యాక్తీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకని తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే మంచి ప్రభావం ఉంటుంది. అలాగే ఇది పీరియాంటల్ ఇన్ఫ్లమేషన్, టూత్ డీకే , క్యావిటీస్ వంటి దంత సమస్యలను దూరంగా ఉంచుతుంది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే జీవక్రియ మరింత వేగంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. అలాగే శరీరంలో కొవ్వులను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading