Home » అరటి పండ్లు వంకరగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ?

అరటి పండ్లు వంకరగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. దీనిని తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇతర పండ్లతో పోల్చితే.. అరటిపండు తక్కువ ధరకే లభిస్తుంది. చాలా రుచి కరంగా ఉంటుంది. ఇది తినడం తేలిక. ముంబై వంటి నగరంలో కొంతమంది భోజనం బదులు అరటిపండ్లు తిని సరిపెట్టుకుంటారు. అరటిపండ్లు వంకరగా ఎందుకు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

అరటిపండ్లు చెట్లపై పెరుగుతాయనే విషయం అందరికీ తెలుసు. తొలుత చెట్టుకు అరటి పువ్వు వస్తుంది. తరువాత ఆ పువ్వుల రేకల కింద చిన్న అరటి పండ్ల వరుసలు పెరగడం ప్రారంభం అవుతుంది. పిలకలు పెద్దవి అవుతూ అరటి గెల తయారవుతుంది. అరటి పండు పెరిగే సమయంలో నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. నెగెటివ్ జియోట్రోపిజం అనగా.. సాధారణంగా భూమి దేనినైనా తనవైపునకు లాక్కుంటుంటుంది. దీనినే ఆకర్షణ అంటారు. అరటిపండ్లు ఈ గావిటికి లొంగవు. భూమికి రివర్స్ లో ఆకాశం వైపునకు తిరుగుతుంటాయి. సూర్యుడి కాంతి ఏ వైపు ఉంటే ఆ వైపు పెరుగుతాయి. సూర్యరశ్మిని గ్రహించేందుకు అరటిపండ్లు పైకి పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో వంకరగా మారుతాయి. పండు పూర్తయ్యే సరికి కొంత వంకరగా ఉండడం మనం చూస్తాం.  

Advertisement

Also Read :  తమిళ స్టార్ హీరో కి జోడిగా ఐశ్వర్య.. 22 ఏళ్ల తర్వాత..!

అరటి చెట్ల ఆకులు పెద్దగా ఉంటాయి. వాటి కింద పెరిగే అరటి గెలకు సూర్యకాంతి అంత త్వరగా రాదు. కాంతి కోసం అరటికాయలు పైకి పెరుగుతాయి. భారత్ లో అరటి చెట్టును పవిత్రమైందిగా భావిస్తారు. ప్రతీది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆకులలో భోజనం చేస్తాం. అరటిపండ్లను ఇష్టమైన దేవానికి నైవేద్యంగా పెడుతారు. అరటి కాండాన్ని ఆవులకు ఆహారంగా పెడతారు. ఈ అరటి కాండం మధ్య భాగంలో మొవ్వ ఉంటుంది. తెల్లగా, తియ్యగా ఉంటుంది. పల్లెల్లో ఈ మొవ్వను ఎక్కువగా తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read :  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..కొత్తగా 23 వేల ఉద్యోగాలు !

Visitors Are Also Reading