నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిమానులు కూడా తారకరత్న మరణంతో ఒక్కసారిగా షాకింగ్ కి గురయ్యారు. ఆయన వెంట బాలకృష్ణ అందరూ మెచ్చుకున్నారు. తారకరత్న పట్ల ఆయన తీసుకున్న కేరింగ్ చూసి జనాలు ప్రశంసలు కురిపించారు.
Advertisement
తారకరత్న కుటుంబ బాధ్యత తనదే అని ఇప్పటికే బాలయ్య ప్రకటించాడు. ఇప్పుడు బాలయ్య తారకరత్న పేరు నిలిచిపోయే విధంగా ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తాను హిందూపురంలో నిర్మించిన ఆసుపత్రిలో రూ.కోటి 30 లక్షలు ఖర్చు చేసి ఓ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాడట. తారకరత్న మరణించిన నేపథ్యంలో అధునాతన గుండె శస్త్ర చికిత్సల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుందట. అంతేకాదు.. తారకరత్న పేరు పెట్టాలని భావిస్తున్నాడట బాలయ్య.
Advertisement
హిందూపురం వాసులు గుండె జబ్బులు వస్తే బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే ప్రజలకు అందుబాటులో హిందూపురం ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకునేవిధంగా అధునాతన టెక్నాలజీతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారట. ఈ విభాగానికి తారకరత్న పేరు పెట్టాలని భావిస్తున్నాడట. దీనికి సంబంధించిన శస్త్ర చికిత్స పరికరాలను కూడా తెప్పించాడట. బాలయ్య చేసిన పనికి సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాలయ్య నిజంగానే దేవుడురా అంటూ ప్రజలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
Also Read : Das Ka Dhamki Review: విశ్వక్ సేన్ మరో హిట్ కొట్టినట్టేనా..?