Home » మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీపై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. అరవింద సమేత, అలా వైకుంఠపురం చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న గురూజీ ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు వరుసహిట్లతో దూకుడు మీద ఉన్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇలా హిట్ల మీద హిట్లు కొట్టుకొని పోతూ తనకి లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఎస్ఎస్ఎంబి 28 మూవీ చేస్తున్నారు.

READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28వ సినిమా కోసం జగన్ పథకం పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఆ’ సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలకు ఎక్కువగా ఆ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ని ఉంటాయి. తీసిన 11 సినిమాల్లో ఆరు సినిమాలకు టైటిల్స్ ఆ తోనే మొదలయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ కి సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో అనేది.

Advertisement

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

SSMB28: Mahesh Babu's High Octane Entertainer Titled After YS Jagan Mohan Reddy's THIS Government Scheme? - Filmibeat

అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురంలో ఇలా ఆ అనే అక్షరంతో మొదలయ్యాయి. తాజాగా మహేష్ తో తెరకేక్కిస్తున్న సినిమాకు ఆ అక్షరంతో మొదలయ్యే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ పథకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన అమ్మ ఒడి పేరును ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అమ్మఒడి అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని ఈ పేరే ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

READ ALSO : కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !

Visitors Are Also Reading