Home » సల్మాన్ ఖాన్ గురించి నటుడు దార సింగ్ ఏమన్నాడో తెలుసా ?

సల్మాన్ ఖాన్ గురించి నటుడు దార సింగ్ ఏమన్నాడో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినీ హీరోలు, హీరోయిన్స్ గ్లామర్ అనేది చాలా ముఖ్యం. గ్లామర్ గా లేని వాళ్లు సినిమాల్లో రాణించలేరనే చెప్పాలి. ప్రేక్షకులు వారి అందాన్ని చూసి ఆకర్షిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందంతో పాటు సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్ నెస్ ని కూడా కచ్చితంగా మెయింటేన్ చేయాల్సిందే.  చాలా మంది హీరోయిన్లు, ముఖ్యంగా హీరోలు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండటానికి జిమ్ చేస్తుంటారు. పక్కా డైట్ ఫాలో అవుతారు. ఫాట్ ఉన్న ఆహారాలు అయితే అస్సలకే ముట్టుకోరు. అంతల సెలబ్రెటీలు డైట్ ఫాల్ అవుతారు.

Advertisement

Advertisement

అయితే ఇందుకు బాలీవడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పూర్తిగా విరుద్ధం. ఆయన ఎలా తింటాడు, వర్క్ అవుట్ ఎలా చేస్తాడు అనే విషయాలు చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ నటుడు దార సింగ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘సల్మాన్, నేను చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. నేను బరువు పెరగడం చూసి సల్మావ్ జిమ్ లో జాయిన్ అయ్యాడు. ఎక్కువ సేపు జిమ్లోనే ఉండేవాడు. అలా అని తిండి విషయంలో ఏమాత్రం తగ్గేవాడు కాదు. పందిలా తింటాడు.. కుక్కలా వర్క్ అవుట్ చేస్తాడు. అదే సల్మాన్ పాలసీ. అంత తిన్నావు కదా ఏం అయింది అంటే వర్క్ అవుట్ చేసి కరిగించేశా అనేవాడు. సల్మాన్ చాలా గొప్ప వ్యక్తి. తనది చాలా మంచి మనసు. నెలకు దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు దానం చేస్తాడు. ఎంత సంపాదించిన తన పాకెట్ మనీ తండ్రి దగ్గరే తీసుకుంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నటుడు దార సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read :  నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ను తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading