Home » హీరోయిన్ అమృత అయ్యార్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

హీరోయిన్ అమృత అయ్యార్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో హను-మాన్ ఒకటి. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యార్ కథానాయికగా నటిస్తుంది. కానీ ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.  చెన్నైలో పుట్టిన అమృత.. బెంగుళూరులో పెరిగింది. గ్రాడ్యుయోషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి అలరించింది.

Advertisement

తొలుత మలయాళంలో 2012లో వచ్చిన పద్మవ్యూహం సినిమాలో చిన్న పాత్రలో నటించారు. 2014 నుంచి తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 2018లో వచ్చిన పదైవీరన్ మూవీలో హీరోయిన్ గా పరిచయం అయింది. విజయ్ దళపతి నటించిన బిగిల్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది అమృత అయ్యార్. టాలీవుడ్ ఇండస్ట్రీకి రెడ్ మూవీతో పరిచయం అయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాల్లో నటించింది. అయితు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?.. సినిమాతో  తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక ఆ తర్వాత అర్జున ఫల్గుణ సినిమాలో  కూడా మెరిసింది.

Advertisement

ఇప్పుడు తేజా సజ్జా నటిస్తోన్న హనుమాన్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యింది.  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 12న రిలీజ్ కాబోతుంది.  సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ సినిమాలు రావడంతో హను-మాన్ మూవీకి థియేటర్ల సమస్య కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో జనవరి 11న సాయంత్రం హను-మాన్ ప్రీమియర్ షోలో వేయనున్నారు. ఈనెల 09న బుకింగ్స్ ఓపెన్ కాగా.. గంటల వ్యవధిలో హౌస్ ఫుల్ కావడం విశేషం. దీంతో మరిన్ని థియేటర్లను పెంచేశారు. హను-మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading