Home » పారిజాత వృక్షం గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా ?

పారిజాత వృక్షం గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా ?

by Anji
Ad

చాలా మంది దైవ పూజ కోసం తమ పెరట్లో పారిజాతం చెట్టును పెంచుతారు. దీనిని ఇంగ్లీషు నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని పిలుస్తారు. సుగంధ పరిమాణాలను వెదజల్లే పారిజాత కుసుమాలు రాత్రి సమయంలో వికసించి తెల్లారే సరికి భూమిపైన తెల్లని తివాచీ పరిచినట్లుగా రాలి ఉంటాయి. దైవారాధనకు సాధారణంగా చెట్టు నుంచి పూసిన పువ్వులను మాత్రమే వాడుతాం.. కానీ పారిజాతాలను మాత్రం చెట్టు నుంచి కొయ్యకూడదని అవి భూమిపైన రాలిన తర్వాతనే వాటిని దేవునికి సమర్పించాలి. అలా ఈ చెట్టు భగవంతుని దగ్గర వరం పొందిందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గలోకం నుండి సత్యభామ కోరిక పైన ఈ వృక్షాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తీసుకు వచ్చాడని చిన్నప్పటి నుంచి కథలుగా వింటూనే ఉన్నాం.

Advertisement

ఇంతటి పవిత్ర వృక్షంలో మీకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు మిళితమై ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేసుకుని ఆ పొడికి కొంచెం నీటిని కలిపి పేస్ట్ లా చేసుకుని తలమాడుకు మర్దన చేస్తే తలపైన వచ్చిన పొక్కులు తగ్గుతాయి.. పారిజాత గింజల చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య దూరం అవుతుంది. పారిజాతం ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో వేసి సన్నని సెగ పైన వేడిచేసి దాన్ని నొప్పుల ఉన్నచోట కడితే నొప్పులు తగ్గిపోతాయి. దీని ఆకుల రసాన్ని నాలుగు చుక్కలు చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. పారిజాతం ఆకులను ఒక 20 తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి సన్నని సెగ పైన అరకప్పు అయ్యేవరకు మరిగించి వడకట్టాలి.

Advertisement

ఈ కషాయం గోరువెచ్చగా ఉండగానే దాంట్లో పావు స్పూన్ మిరియాల పొడి కలిపి ప్రతి రోజు ఉదయం సాయంత్రం తాగితే సయాటికా నొప్పి తగ్గిపోతుంది. గజ్జి తామర వంటి చర్మవ్యాధులతో బాధపడేవారు పారిజాతం గింజలను కుండ పెంకులో మాడ్చి మసిగా చేసుకుని ఈ చూర్ణానికి హారతి కర్పూరం కొబ్బరి నూనె కలిపి ఆ లేపనాన్ని అవి ఉన్న ప్రాంతంలో పై పూర్తిగా పూస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలామంది చెట్లను కేవలం దేవాలయాల్లో మాత్రమే పెంచాలి. ఇంట్లో పెంచకూడదు అనుకుంటూ ఉంటారు. అలాంటిదేమీ లేదు. ఈ చెట్టు పువ్వులు అందరూ నడిచే ప్రదేశంలో పడకుండా తగిన స్థలాన్ని ఎంపిక చేసి మీ పెరట్లోనే పెంచుకోవచ్చు.. ఈ చెట్టు మీ ప్రాంగణంలో ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading