Home » మెగాస్టార్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా ?

మెగాస్టార్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ అగ్రహీరో ఎన్నో సినిమాలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్రహీరోగా మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. యువ దర్శకులు, నటీనటులకు తన సినిమాల ద్వారా అవకాశాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు కావడం విశేషం.


సినిమాలు, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. అంజనా ప్రొడక్షన్ హౌస్ ద్వారా చిరు ఆస్తులు చాలా ఎక్కువ కూడపెట్టారు. చిరుకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కోట్లాది రూపాయల విలువ చేసే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. అందులో సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించుకున్నారు. దాని విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ కూడా బెంగళూరులో ఉంది. అదే విధంగా చిరంజీవి దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఖరీదైన ఆటోమొబైల్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ తో పాటు ఆస్టన్ మార్టిన్ v8 వాన్టేజ్ కూడా ఉంది. అదేవిధంగా చిరు ఒక ప్రైవేటు జెట్ కూడా కలిగి ఉన్నారు.

Advertisement

Advertisement

Manam News

 

ఇక చిరు పలు వ్యాపారాల ద్వారా కూడా ఇన్ కమ్ కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా చిరంజీవి ఆస్తుల విలువ రూ.1,650 కోట్లు ఉంటుందని అంటున్నారు. చిరు సంపాదించడంతో పాటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, తదితర కార్యక్రమాలతో ప్రజాసేవ కూడా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా వ్యాపారాల ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారు. నేటితో చిరు 68వ ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, మెగా ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సినిమాలు చేసి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నారు. చివరిగా చిరు భోళాశంకర్ తో జనాలకు భయంకరమైన ప్లాప్ ఇచ్చిన చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

ఖుషి మూవీకి అదే మైనస్ అవ్వనుందా ?

Visitors Are Also Reading