ప్రముఖ వైద్యులు సమరం అంటే ఎవరూ తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన తన వైద్య వృత్తితోనే కాకుండా రచయిత, సమాజ సేవ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సమరం గారు పుట్టింది మచిలీపట్నం, ఆయన ఒక నాస్తిక వాది. ఆయన తండ్రి ప్రముఖ నాస్తిక వాది అయిన గోరా. ఆయన సిద్ధాంతాలను ఈయన ఒంటపట్టించుకుని అనేక గ్రామాలు, తెలంగాణలోని అనేక పల్లెల్లో బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను తొలగించడానికి అవగాహనశిబిరాలను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను చేశారు. వైద్య వృత్తితో 50 ఏళ్లకు పైగానే ఉన్న సమరం గారు ఆయన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Advertisement
Advertisement
సమరం గారు వైద్య వృత్తిలో కొనసాగుతూనే.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హాస్పిటల్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. సమరం పెళ్లి చేసుకున్నప్పుడు భార్యకు వాళ్ళ పుట్టింటి వాళ్లు ఇచ్చిన కానుక ఆసుపత్రి స్థలం అని.. అందులో హాస్పిటల్ కట్టడానికి బ్యాంకు లోన్ తీసుకొని 50 ఏళ్లు లోన్ ద్వారా కొంచెం కొంచెంగా హాస్పిటల్ ను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. తన అక్క కూతురునే పెళ్లి చేసుకున్నారు డాక్టర్ సమరం.
ఇక ప్రస్తుతం కోట్లలో ఉన్న ఆ హాస్పిటల్ విలువ అప్పట్లో స్థలం గజం 7 రూపాయలు మాత్రమే అంటూ తెలిపారు. ఇక తాను సంపాదించిన ఆస్తి కంటే సంపాదించుకున్న అభిమానులే నాకు గొప్ప ఆస్తి అంటూ వెల్లడించారు. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారని.. పాఠశాలలకు వెళ్ళినప్పుడు స్వాతంత్య్ర సమరయోధులను అడుగగా పిల్లలు చెప్పలేకపోయారు. కానీ నా పేరు చెప్పగానే తెలుసని చేతులెత్తారు. అంతకంటే ఏమి కావాలి అంటూ చెప్పారు.
Also Read : అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్..!