సినిమా ఇండస్ట్రీలో ఒక్కోక్కరిది ఓ చరిత్ర. కొంత మంది సినిమాల్లో ఫ్యామిలీ ద్వారా పైకి ఎదుగుతుంటారు. మరికొందరూ సొంత టాలెంట్‌తో సినీ ఇండస్ట్రీని ఎలుతుంటారు. ముఖ్యంగా 1980 దశాబ్దంలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా నడుస్తున్నరోజుల్లో ఇద్దరూ హాస్య హీరోలు తెలుగు ప్రేక్షకులను తమదైన పాత్రలతో కడుపుబ్బ నవ్వించే వారు. వారిలో ఒకరు రాజేంద్రప్రసాద్ అయితే.. మరొకరు సీనియర్ నరేష్. ఎక్కువగా జంధ్యాల రేలంగి నరసింహారావు వంటి దర్శకుల చిత్రాల్లో ఈ హాస్య హీరోలు కనిపించేవారు.
Also Read : నిక్కీని పెళ్లి చేసుకోవాలని 4 ఏళ్ల క్రితమే ఆదికి చెప్పిన నాని…వీడియో వైరల్..!
Advertisement
Advertisement
ఇక సీనియర్ నరేష్ విషయానికొస్తే.. 1970లో రెండు కుటుంబాల కథ, 1972లో పండంటి కాపురం అనే చిత్రాల్లో బాలనటుడిగా తెలుగు తెరపై కనిపించారు. ఆ తరువాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో ప్రేమ సంకెళ్లు అనే చిత్రంలో హీరోగా నటించారు. ఆ తరువాత నాలుగు స్థంబాలాట, రెండు జైళ్ల సీత, శ్రీవారికి ప్రేమ లేఖ, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జస్టిస్ రుద్రమదేవి, కోకిల వంటి సినిమాలు తీస్తున్న తరుణంలో రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమా నరేష్ కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచింది. ఆ తరువాత 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడిపంబ సినిమా అద్భుత విజయాన్ని అందించింది.
నరేష్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆయన తొలుత సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరిద్ధరికీ నవీన్ అనే కుమారుడు జన్మించాడు. కొన్ని మనస్పార్థాల వలన వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్న కూడా అది కాస్త విడాకుల వరకు వెళ్లింది. తరువాత నరేష్ 50 ఏళ్ల వయస్సులో సీనియర్ రాజకీయ నాయకుడైన రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యను 2010లో పెళ్లి చేసుకున్నాడు.
Also Read : కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించిన సినిమాలు ఇవే..!